జై భీమ్ టీవీ - జాతియం / : 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు వేడుక నేడు(అక్టోబర్ 17) రంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్నాయి. ఈ అవార్డుల అన్ని విభాగాల విజేతలను ఇప్పటికే ప్రకటించారు. ఉత్తమ నటుడి విభాగంలో పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్‌కు అవార్డును అందజేయనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు అల్లు అర్జున్ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో భార్య స్నేహతో కలిసి కనిపించాడు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన మొదటి తెలుగు స్టార్ అల్లు అర్జున్ అని తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు, ఆర్ఆర్ఆర్ దర్శకుడు SS రాజమౌళి, సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి కూడా ఢిల్లీలో జరిగే అవార్డుల వేడుకకు హాజరుకానున్నారు. RRR, పుష్ప సినిమాలకు అవార్డులు RRR సినిమాకు ఉత్తమ పాపులర్ ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఉత్తమ సంగీత దర్శకత్వం కోసం అవార్డులను అందుకోనుంది. అల్లు అర్జున్, ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి ఢిల్లీకి చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సారి 69వ జాతీయ అవార్డుల్లో సౌత్ సినిమాలు దూసుకుపోతున్నాయి. పుష్ప చిత్రానికి గానూ దేవిశ్రీ ప్రసాద్‌కి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు ఇవ్వనున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ కోసం ఉత్తమ కొరియోగ్రఫీగా ప్రేమ్ రక్షిత్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం శ్రీనివాస్ మోహన్‌కు అవార్డులు ఇవ్వనున్నారు. పుష్ప, ఆర్ఆర్ఆర్ ఈ రెండు చిత్రాలు 2022లో బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఆర్ఆర్ఆర్ సినిమా రూ. 1100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఆర్ఆర్ఆర్ . అలాగే ఎంఎం కీరవాణి ఉత్తమ సంగీత స్వరకర్తగా నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు అనుకున్నారు. ఇక పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 350 కోట్ల బిజినెస్ చేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటించింది. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ లో మెప్పించింది.
Admin