Saturday, 15 February 2025 06:51:08 PM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

మేకలు, గొర్రెలకు మేతగా కమ్మటి కొత్తిమీర.. సాగు చేసిన రైతుల కంట కన్నీరు.. ఆ కారణంతోనే దిగాలు

Date : 07 November 2023 11:45 AM Views : 209

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : కొత్తిమీర ఆకు లేనిదే ఏ వంటకు రుచి రాదు. అన్ని వంటల్లో తప్పనిసరిగా కొత్తిమీర ఉండాల్సిందే.. అందుకే కొత్తిమీరకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ, కొత్తిమీర పంటను సాగు చేసిన రైతులకు మాత్రం కొత్తిమీర కన్నీటిని మిగులుస్తుంది. మార్కెట్లో కొత్తిమీర కు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతన్నల్లు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో కొత్తిమీర సాగు చేసిన రైతు లబోదిబోమంటున్నారు. కొత్తిర పంటకు గిట్టుబాటు ధర లేక పండిన పంటను గొర్రెలను మేతగా వదిలాడు. రైతు రాముడు రెండు ఎకరాల్లో కొత్తిమీర పంటను సాగు చేసేందుకు గాను రూ 2లక్షల వరకు పెట్టుబడి పెట్టామని,ఈ పంట 40 రోజుల్లో కోతకు వస్తుందని తెలిపాడు.అదును తప్పితే, ఇక పంట ముదురుతే కొనేందుకు వ్యాపారులు రారని,దీంతో పంట లేతగా ఉన్న సమయంలోనే అమ్మకాలు జరగాలి, కాని గిట్టుబాటు ధర పలకడం లేదని రైతు ఆవేదనా వ్యక్తం చేస్తున్నాడు. కొత్తిమిరను వ్యాపారులు బెడ్లు ప్రకారం కొనుగోలు చేస్తారని, బెడ్ ప్రస్తుతం రూ.100 పలుకుతుండగ ఒక కొత్తిమీరా కట్ట రూ.5 పలుకుతూ,వ్యాపారం రూ. 10వేలు దాటడంలేదని పెట్టుబడి కూడా రావడం లేదు. కూలీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతు రాముడు తాను రెండు ఎకరాల్లో సాగుచేసిన కొత్తిమీర పంటను గొర్రెలకు మేతగా వేశాడు. పంట చేతికి వచ్చే సమయానికి కొత్తిమీర రైతు ఆశలు అడియాశలయ్యాయి. సుమారు రెండు నెలల పాటు కొత్తిమీర పంటని కంటికి రెప్పలా కాపాడుకున్నా.. పంట చేతికి వచ్చేసరికి ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు దిగాలు పడిపోయారు. సాగు ఖర్చులో సగం కూడా వెనక్కు రాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :