Thursday, 05 December 2024 06:03:08 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోలేకపోయిన ముఖ్యమంత్రి.. ఎందుకో తెలుసా..?

Date : 07 November 2023 11:53 AM Views : 172

జై భీమ్ టీవీ - జాతియం / : మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఓటే వేసేందుకు వచ్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని పరిణామం ఎదురైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పనిచేయకపోవడంతో మిజోరం సీఎం జోరంతంగా ఓటు వేయలేకపోయారు. మిజోరాంలో 40 మంది సభ్యుల అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు, గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఓటు వేసే సమయంలో ఈవీఎం యంత్రం పనిచేయలేదన్నారు సీఎం జోరంతంగా. ఈవీఎం ద్వారా ఓటు వేయడానికి ప్రయత్నించారు. కానీ యంత్రం మొరాయించింది. తిరిగి వచ్చి ఓటు వేస్తానని వెళ్ళిపోయారు సీఎం జోరంతంగా. మిజోరంలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు అయ్యే అవకాశముందని, తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. దానిపై పూర్తి విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు. 174 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించడానికి మిజోరంలో దాదాపు 8.57 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో దాదాపు 4.39 లక్షల మంది మహిళల ఓటర్లు ఉన్నారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), ప్రధాన ప్రతిపక్షం జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM), కాంగ్రెస్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ 23 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రతిపాదించింది. వీరితో పాటు 27 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మిజోరం అంతటా ఉన్న 1,276 పోలింగ్ స్టేషన్‌లలో 149 రిమోట్ ఓటింగ్ కేంద్రాలు, అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్న 30 కీలకమైనవిగా ప్రకటించింది ఎన్నికల సంఘం. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7,200 మంది సిబ్బందితో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్‌కు ముందు మయన్మార్‌తో 510 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దు, బంగ్లాదేశ్‌తో 318 కిలోమీటర్ల సరిహద్దును మూసివేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :