జై భీమ్ టీవీ - జాతియం / : కర్ణుడు సహజ కవచ కుండలాలతో జనమించినట్లు పురాణాల్లో చదువుకున్నాం.. అదే విధంగా నేటి కాలంలో అమ్మ కడుపులో నుంచి బయటపడుతూ శిశువు సెల్ ఫోన్ సెల్ ఫోన్ అని ఏడుస్తున్నాడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తూ ఉండడం వింటూనే ఉన్నాం.. దీనికి కారణం కూడా ప్రతి ఒక్కరికీ తెలుసు.. వయసుతో సంబంధం లేదు.. చిన్న పెద్ద ఉన్నవాడు లేనివాడు అనే తేడా లేదు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిద్ర పోయే సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా ఫోన్ తోనే ఫోన్ లోనే గడుపుతున్నాడు అంటే అతిశయోక్తి కాదు. ఇలా మొబైల్ ఫోన్ లో ఎక్కువ సమయం గడుపుతున్న తనయుడిని తల్లిదండ్రులు మందలించడంతో సూసైడ్ చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న తమ కొడుకు రోజూ ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ లో ఏదొకటి చూస్తూ గడిపేయడం తల్లిదండ్రులు చూశారు. దీంతో ఫోన్ పక్కకు పెట్టు.. చదువుపై దృష్టి పెట్టు అని గట్టిగా చెప్పారు. దీంతో మన స్తాపానికి గురైన ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చిక్కబళ్లాపూర్ జిల్లా గౌరిబిదనూరు సమీపంలోని చిట్టవలహళ్లి గ్రామానికి చెందిన లోకేష్ అనే 15 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం తనను ఫోన్ పక్కకు పెట్టి.. చదువుకోమని తల్లిదండ్రులు చెప్పడంతో కోపంతో ఇంటికి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అనంతరం సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోకేష్ తండ్రి రైతు.. తనకు లా తన కొడుకు కష్టపడకూడని భావించిన ఆ తండ్రి కొడుకు బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం చేయాలనీ భావించినట్లు ఉన్నాడు. దీంతో తన కొడుకు మొబైల్ ఫోన్లలో కాలక్షేపం చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని కోరినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆత్మహత్య నివారణ కోసం హెల్ప్‌లైన్ కారణం ఏదైనా సరే చిన్న , పెద్ద ఎవరైనా సరే పరిస్థితులతో పోరాడాలి.. అంతేకాని చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోకండి.. మీకు ఆత్మహత్య ఆలోచనలు ఉంటే మీ ప్రియమైన వారితో మాట్లాడండి. సాధ్యం కాకపోతే ఆత్మహత్య నివారణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. హెల్ప్‌లైన్ నంబర్ – 9152987821, హెల్త్ హెల్ప్‌లైన్: 104, సహాయ్ హెల్ప్‌లైన్: 080-25497777 అంటూ కర్ణాటక ప్రభుత్వం ఎలుగెత్తి చాటుతోంది.
Admin