Thursday, 05 December 2024 07:20:35 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

భూపేష్ బఘేల్ తప్పించుకుంటున్నారు.. ఇండియా కూటమిలో సరైన నాయకుడే లేడు: కేంద్ర మంత్రి ఫైర్

Date : 07 November 2023 11:56 AM Views : 166

జై భీమ్ టీవీ - జాతియం / : అసెంబ్లీ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మహాదేవ్‌ బెట్టింగ్ యాప్ తీవ్ర కలకలం రేపుతోంది. బెట్టింగ్‌ యాప్‌ స్కాంపై కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటలయుద్దం నడుస్తోంది. తనపై బీజేపీ చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ఘాటైన కౌంటరిచ్చారు. నవంబర్ 17 వరకు ఎంజాయ్‌ చేయండంటూ బీజేపీ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఈ బెట్టింగ్‌ యాప్‌ను చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నవంబర్‌ 17 వరకు ఎంజాయ్ చేయగలదు. కానీ.. ఈ ఆరోపణలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవంటూ పేర్కొన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే ఇలాంటి ప్రయత్నాలను ఎన్నికల సంఘం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వ్యాఖ్యల అనంతరం.. బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంపై భూపేష్ బఘేల్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. భూపేష్ బఘేల్ ప్రశ్నల నుంచి తప్పించుకుంటున్నారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఆయన ప్రజలకు లేదా దర్యాప్తు సంస్థలకు లేదా మీడియాకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.. అంటూ కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడిన వీడియో.. అంతేకాకుండా.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇండియా కూటమిపై కూడా విమర్శలు గుప్పించారు. తాను ఇప్పటికే చెప్పినట్లు, భారత కూటమిలో సరైన నాయకుడు లేదా విధానం లేదు.. వారి ఉద్దేశాలలో కూడా లోపం ఉందంటూ పేర్కొన్నారు. ఈ కూటమిలోని చాలా మంది నాయకులు అవినీతికి పాల్పడ్డారని.. తమను తాము రక్షించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కాగా.. దుబాయ్‌లో ఉన్న మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ యజమాని శుభమ్‌ సోని మాట్లాడిన వీడియో వైరల్‌ అయ్యింది. ఆ యాప్‌ను రూపొందించేందుకు భూపేశ్‌ తనను ప్రోత్సాహించారని శుభమ్‌ సోని ఆరోపించాడు. ఇప్పటివరకు ఆయనకు రూ.508 కోట్లు చెల్లించానంటూ పేర్కొన్నాడు. బెట్టింగ్‌ యాప్‌నకు అసలైన ఓనర్‌ సీఎం బఘేల్‌ అని వీడియోలో పేర్కొన్నాడు. భిలాయ్‌లో తన సహచరులు అరెస్టు అయినప్పుడు.. సీఎం తనని యూఏఈకి పారిపోవాలని సలహా ఇచ్చిన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈడీ చర్యలు ప్రారంభించిందని.. ఈ వ్యవహారం నుంచి తనని బయటపడేయాలంటూ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. తొలిదశ పోలింగ్‌ ఇవాళ జరుగుతోంది. 17న రెండో దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్ మూడున ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ కలకలం రేపుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :