Wednesday, 25 June 2025 12:41:44 PM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

ఎన్నికల కమిషన్‌కి వినూత్న వినతి.. పోలింగ్ రోజు ఓటర్లకి ఆ టెస్ట్ చేయాలన్న అసోసియేషన్

Date : 14 November 2023 12:52 PM Views : 285

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికల వేడి పెరిగింది. ప్రచార హోరు పెరగడంతో రకరకాల ఫిర్యాదులు ఎన్నికల కమిషన్‌కు అందుతున్నాయి. ఒక పార్టీ మమ్మల్ని కించపరిచేలా ప్రచారం చేస్తుందని.. మరో పార్టీ మాపై దాడి చేశారని.. మరికొందరు ఎన్నికల నిబంధనలతో మాకు ఇబ్బంది కలుగుతున్నయని ఇలా రకరకాల ఫిర్యాదులు ఈసీ ముందుకు వస్తున్నాయి. కానీ ఈ ఒక్క వినతి మాత్రం అందర్నీ ఆశ్చర్యాన్ని గురి చేసేలా ఉంది. ఇంతకీ అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి రాజకీయ నేత దగ్గర నుండి సామాన్య ప్రజానీకం వరకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. ఇందులో భాగంగా చాలా మంది తమ సమస్యలను కంప్లైంట్స్‌ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇందులో లాస్ట్ వీక్ బుధవారం రోజు ఓ అసోసియేషన్ ఇచ్చిన వినతి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఆ అసోసియేషన్ ఇచ్చిన వినతి ఏంటి? అసలు ఆ అసోసియేషన్ ఏంటి? రెవెన్యూ కింగ్స్ ఆఫ్ డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఎన్నికలు సజావుగా జరగాలాన్న కోరికతో ఈసీని ఆశ్రయించి ఎన్నికలు జరిగే రోజు నవంబర్ 30 వ తారీఖున ప్రతి పోలింగ్ స్టేషన్ బయట బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఓటరు ఎవరు ప్రలోభాలకు గురికాకుండా ఆల్కహాల్ మత్తులో ఎవరికి ఓటు వేస్తున్నాము తెలియకుండా భవిష్యత్తు ఐదు సంవత్సరాలని వృధా చేసుకోవద్దు అన్న విషయంపై ఈ వినతిని ఈసీకి అందించామని డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటున్నారు. Telangana: వేడెక్కుతోన్న రాజకీయం.. తెలంగాణలో మకాం వేయనున్న కాంగ్రెస్‌ అగ్ర నేతలు.. రెవెన్యూ కింగ్స్ ఆఫ్ డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన వినతికి ఆశ్చర్యపోయినప్పటికీ ఆలోచింపచేసేలా ఉంది అని అనుకుంటున్నారు. కానీ ప్రచారంలో భాగంగా బీరు, బిర్యానీకి ఏ పార్టీ ఎంత ఇస్తుంది అని ఆలోచించే వారున్న ఈ సమాజంలో ఓటు ఆయుధాన్ని మద్యం మత్తులో వృధా చేసుకోవద్దని చెప్పే ఈ వినతి ఆలోచింపచేసేలా ఉందని పలువురు అనుకుంటున్నారు. Drunker Welfare Association Requests Election Commission To Conduct Breathalyzer Test Outside Polling Station

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :