Wednesday, 15 January 2025 06:36:57 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 8,773 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. డిగ్రీ అర్హత

Date : 17 November 2023 12:09 AM Views : 261

జై భీమ్ టీవీ - జాతియం / : ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భారీగా క్లర్క్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో మొత్తం 8,773 జూనియర్‌ అసోసియేట్స్‌ (క్లరికల్‌ కేడర్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో 575 పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌ సర్కిల్‌ (తెలంగాణ) సర్కిల్‌లో 525 పోస్టులు, అమరావతి సర్కిల్‌లో 50 జూనియర్‌ అసోసియేట్స్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 17, 2023 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 7వ తేదీని దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విభాగంలో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్‌/ చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు ఏప్రిల్‌ 01, 2023 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్‌ 2, 1995 నుంచి ఏప్రిల్ 1, 2003 మధ్య జన్మించి ఉండాలన్నమాట. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ రాత పరీక్షలు), స్థానిక భాష నైపుణ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.19,900 చొప్పున జీతంగా చెల్లిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష విధానం.. ప్రిలిమినరీ మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30 ప్రశ్నలు – 30 మార్కులకు, న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగం నుంచి 35 ప్రశ్నలు – 35 మార్కులకు, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు – 35 మార్కులకు పరీక్ష ఉంటుంది. గంట సమయంలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తొలగిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే ప్రధాన పరీక్షకు ఎంపిక అనుమతిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: నవంబర్‌ 17, 2023. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్‌ 7, 2023. ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జనవరి 2024లో ఉంటుంది. మెయిన్‌ పరీక్ష తేది: ఫిబ్రవరి 2024లో ఉంటుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :