Friday, 04 October 2024 03:53:03 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి..

రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Date : 30 July 2024 07:24 AM Views : 76

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : రెవెన్యూ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగం అయిన తీరుపై అధికారులతో చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపైనా సమీక్షించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్ గ్రాబింగ్​ను అరికట్టడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా.. ఉంటే ఎలాంటి కొత్త చట్టాలు తేవాలి?.. అనే అంశంపైనా అధికారులను ఆరా తీశారు. మరోవైపు… పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించిన చంద్రబాబు.. భూ యజమానులకిచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో భూ అక్రమాల ఆరోపణలపై, గత ఐదేళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలపై సమీక్ష నిర్వహించారు. పెరిగిన భూ వివాదాలను పరిష్కరించడంపైనా చంద్రబాబు పలు సూచనలు చేశారు గత పాలనలో 22Aలో పెట్టిన భూములెన్ని? లాభపడింది ఎవరు? అక్రమంగా జరిగిన భూలావాదేవీలెన్ని? నష్టపోయింది ఎంత?, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎన్ని ఎకరాలు వెళ్లాయి? పూర్తి డేటాతో వచ్చేవారంతో మరోసారి సమీక్షకు రావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భూసర్వే పేరుతో రాష్ట్రంలో 77లక్షల రాళ్లు పాతారని చెప్పిన అధికారులు వివరణ ఇచ్చారు.. విశాఖ, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరుల్లో అత్యధికంగా భూములపై ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై వచ్చేవారంలోగా పూర్తి డేటా కావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :