Thursday, 15 January 2026 06:57:45 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు

నిరుటితో పోలిస్తే పెరిగిన 10 వేల మంది బాధితులు

Date : 30 December 2025 08:46 AM Views : 55

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : రేబిస్ వ్యాధితో 32 మంది మృతి గ్రామాల్లో కోతుల బెడద.. వృద్ధులపై దాడులు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన డోర్నకల్ ఎమ్మెల్యే మద్దతుగా స్పందించిన స్పీకర్ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ప్రజలను కుక్కలు, కోతుల బెడద వేధిస్తున్నది. ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టాలంటే భయపడిపోతున్నరు. ముఖ్యంగా పదేండ్లలోపు చిన్నారులైతే ఒంటరిగా బయటికెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఈ ఏడాది 1.31 లక్షల మంది కుక్కకాటుకు గురయ్యారు. నిరుడితో పోలిస్తే 10వేల మంది బాధితులు పెరిగినట్లు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. అదే సమయంలో కోతులు కరిచిన కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. పలుచోట్ల కుక్కలు కరిచి చిన్న పిల్లలు చనిపోయిన ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో రేబిస్ మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో నగర వాసులు ఎదుర్కొంటున్న కుక్కల బెడద అంశాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ సోమవారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా కుక్కల బెడదను అరికట్టాలని కోరారు. ఇదే సమయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం కోతుల బెడదతో జరుగుతున్న నష్టాలను అసెంబ్లీకి వివరించారు. వికారాబాద్ ఏరియాలో రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను నాశనం చేస్తున్నాయని చెప్పారు. కుక్కలు, కోతుల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి స్పీకర్​ సూచించారు. ఏటా పెరుగుతున్న కుక్క కాటు కేసులు కుక్క కాటు కేసులు రాష్ట్రంలో ఏటా పెరుగుతున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. సగటున రోజుకు 300 మందిని కుక్కలు కరుస్తున్నాయి. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రతీ రోజు 100 మంది కుక్కకాటుకు గురవుతున్నట్లు ప్రభుత్వ ఆఫీసర్లు చెప్తున్నారు. 2022లో రేబిస్ వ్యాధి బారినపడి 8 మంది చనిపోతే ఈ ఏడాది 32 మంది మరణించారు. 2024లో కుక్క కాటు బాధితులు 1.21 లక్షల మంది ఉండగా.. ఈ ఏడాది మరో 10 వేలు పెరిగి 1.31 లక్షల మందికి పైగా బాధితులు ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట గంటకు 20 మందిపై కుక్కలు దాడి చేస్తున్నాయి. 2021 నుంచి ఇప్పటి దాకా 4.60 లక్షల మంది కుక్కకాటుకు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 3.80 లక్షల వీధి కుక్కలు రాష్ట్రంలో వీధికుక్కల సంఖ్య 3.80 లక్షలు కాగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 60 వేలు ఉంటాయని ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. వీటికి సరైన ఆదరణ.. తిండిపెట్టేవాళ్లు లేక చిన్నారులపై దాడిచేస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా స్కూల్​కు వెళ్తున్నప్పుడో.. వీధిలో ఆడుకుంటున్నప్పుడో.. సైకిల్ మీద ప్రయాణిస్తున్నప్పుడో ఎక్కువగా చిన్న పిల్లలను టార్గెట్ చేస్తున్నాయి. ఒంటరిగా ఉన్న 15 ఏండ్లలోపు వారిని కుక్కలు కరిచి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్​వో) లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబిస్ మరణాల్లో 35% ఇండియాలోనే జరుగుతున్నాయని.. అందులోనూ ముఖ్యంగా తెలంగాణలో వీటి సంఖ్య ఎక్కువ అని అంటున్నారు. కాగా, విదేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. రోడ్లపై కనిపిస్తే వాటిని బంధిస్తారు. 10 రోజుల్లోగా ఎవరైనా వచ్చి తీసుకెళ్లకపోతే వాటిని చంపేస్తారు. పెంపుడు కుక్కల విషయంలో ఓనర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కుక్కల మల మూత్ర విసర్జనకు, వాకింగ్ వంటి పనులకోసం వాటిని రోడ్లపైకి తీసుకెళ్లకూడదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రోడ్లపై కుక్కలు కనిపించొద్దని, వాటన్నింటినీ సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సమస్యపై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టడం నిషిద్ధమని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ముఖ్యంగా స్కూల్స్, హాస్పిటల్స్, బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, స్పోర్ట్ కాంప్లెక్స్ వంటి ఏరియాల్లో కుక్కలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కోతల బెడద తక్కువేమి కాదు గ్రామాల్లోనూ కోతుల బెడద ప్రజలను వేధిస్తున్నది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోతులను పట్టి గ్రామంలో లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన చాలా మంది అభ్యర్థులను సర్పంచ్​లుగా గెలిపించారు. వృద్ధులు నివాసం ఉన్న ఇండ్లల్లోకి కోతులన్నీ గుంపుగా వెళ్లి దాడిచేసి సామా న్లు ఎత్తుకెళ్తున్నాయి. చిన్నపిల్లలు వీధి వెంబడి నడుచుకుంటూ పోతే వాళ్లపై దాడి చేసి గాయప రుస్తున్నాయి. కోతులతో చనిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు నరకం చూపిస్తున్నాయి. పంటలపై మూకుమ్మడిగా దాడిచేసి నష్టపరుస్తున్నాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :