Thursday, 15 January 2026 06:55:27 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ

వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ

Date : 30 December 2025 08:49 AM Views : 65

జై భీమ్ టీవీ - క్రీడలు / : దోహా: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్‌‌‌‌ విశ్వవేదికపై తన ఎత్తులతో అదరగొడుతున్నాడు. ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ ర్యాపిడ్‌‌‌‌ చెస్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో కాంస్యంతో మెరిసిన అతను బ్లిట్జ్‌‌‌‌ విభాగంలోనూ టాప్ గేర్‌‌‌‌‌‌‌‌లో దూసుకెళ్తున్నాడు. సోమవారం మొదలైన బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో లెజెండరీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ను ఓడించడంతో పాటు తొలి 13 రౌండ్లలో 8 గేమ్స్‌‌‌‌లో విజయం సాధించాడు. మరో 4 రౌండ్లను డ్రా చేసుకున్న అతను ఒకే ఒక్క ఓటమితో 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫాబియానో కరువానా (అమెరికా), మాక్సిమ్ లాగ్రావ్ (ఫ్రాన్స్‌‌‌‌) కూడా చెరో పది పాయింట్లతో నిలిచారు. ర్యాపిడ్‌‌‌‌లో థర్డ్ ప్లేస్‌‌‌‌తో బ్రాంజ్ నెగ్గిన జోరును అర్జున్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌లోనూ కొనసాగించాడు. చకచకా తెలివైన ఎత్తులు వేస్తూ తొలి ఐదు గేమ్స్‌‌‌‌లోనూ విజయం అందుకున్నాడు. ఆరో గేమ్‌‌‌‌లో డచ్‌‌‌‌ గ్రాండ్ మాస్టర్ జోర్డెన్ వాన్ ఫారెస్ట్ చేతిలో ఓడిపోయాడు. అయినా టాప్ ప్లేస్‌‌‌‌ నిలబెట్టుకున్న తెలంగాణ కుర్రాడు వెంటనే పుంజుకున్నాడు. ఏడో రౌండ్‌‌‌‌లో 44 ఎత్తుల్లో డెనిస్ మఖ్నేవ్‌‌‌‌కు చెక్ పెట్టాడు. తర్వాతి గేమ్‌‌‌‌ను అలీరెజా ఫిర్జౌసాతో డ్రా చేసుకున్న అర్జున్‌‌‌‌.. తొమ్మిదో రౌండ్‌‌‌‌లో ర్యాపిడ్ చాంప్‌‌‌‌ మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ను ఓడించి ఔరా అనిపించాడు. నల్లపావులతో ఆడిన వరంగల్ ప్లేయర్ 45 ఎత్తుల తర్వాత టైమ్‌‌‌‌ కంట్రోల్ ఆధారంగా కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ పనిపట్టి కాన్ఫిడెన్స్ పెంచుకున్నాడు. అర్జున్ చేతిలో ఓడిన నిరాశలో కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ టేబుల్‌‌‌‌ను గట్టిగా కొట్టాడు. అదే జోరుతో పదో గేమ్‌‌‌‌లో ఉజ్బెక్ గ్రాండ్‌‌‌‌మాస్టర్ నోడిర్బెక్ అబ్దుసత్టోరోవ్ ను ఓడించిన అర్జున్‌‌‌‌.. తర్వాతి రెండు గేమ్స్‌‌‌‌లో మేటి ప్లేయర్లు కరువానా, లాగ్రావ్ తో పాటు 13వ గేమ్‌‌‌‌లో డిమిత్రివిచ్ డుబోవ్ (నార్వే)తో డ్రా చేసుకున్నాడు. ఆర్. ప్రజ్ఞానంద, ఎమ్‌‌‌‌. ప్రణేష్‌‌‌‌, గౌతమ్‌‌‌‌ కృష్ణ తలో 9 పాయింట్లతో వరుసగా 13, 14, 15వ స్థానాల్లో నిలిచారు. ఇక, విమెన్స్ సెక్షన్‌‌‌‌లో ర్యాపిడ్ బ్రాంజ్ విన్నర్ కోనేరు హంపితో పాటు ఇండియా ప్లేయర్లంతా నిరాశపరిచారు. తొలి 10 రౌండ్లలో దివ్యా దేశ్‌‌‌‌ముఖ్‌‌‌‌ 6 పాయింట్లు నెగ్గి 34 ర్యాంక్‌‌‌‌లో నిలవగా.. ద్రోణవల్లి హారిక, పద్మినీ రౌత్‌‌‌‌ చెరో 5.5 పాయింట్లు, హంపి 5 పాయింట్లు మాత్రమే రాబట్టారు. మంగళవారం ఓపెన్ సెక్షన్‌‌‌‌లో మరో ఆరు రౌండ్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌లో మరో ఐదు రౌండ్స్‌‌‌‌తో పాటు సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. అర్జున్, హంపికి పీఎం మోదీ అభినందన ఫిడే ర్యాపిడ్ చెస్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో కాంస్య పతకాలు సాధించిన అర్జున్, హంపిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘వరల్డ్ ర్యాపిడ్ చెస్‌‌‌‌లో అర్జున్ కాంస్యం గెలవడం గర్వకారణం. అతని పట్టుదల అద్భుతం. భవిష్యత్తులో తను మరిన్ని విజయాలు సాధించాలి’ అని మోదీ ఎక్స్‌‌‌‌లో పోస్ట్ చేశారు. ఆట పట్ల హంపి అంకితభావం ఎంతో ప్రశంసనీయమని అన్నారు.

Shiva

Admin

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :