Thursday, 15 January 2026 06:56:17 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు

తక్షణమే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేయాలి: హరీశ్​రావు

Date : 30 December 2025 08:55 AM Views : 54

జై భీమ్ టీవీ - క్రీడలు / : జీరో అవర్​లో సమస్యలను ప్రస్తావించిన పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే​హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. పీఆర్ సీ, సీపీఎస్ నుంచి ఓపీఎస్, రిటైర్ అయిన ఉద్యోగుల సెటిల్ మెంట్ పైసలు కూడా పెండింగ్ లో ఉన్నాయని.. ఈహెచ్ ఎస్ అమలు కావడం లేదని ఆయన గుర్తుచేశారు. సంతాప తీర్మానం ముగిసిన తరువాత స్పీకర్ ప్రసాద్ కుమార్ జీరో అవర్ ను ప్రకటించారు. సుమారు గంటన్నర పాటు జరిగిన జీరో అవర్ లో కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నుంచి మొత్తం 35 మంది మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులు 39 మంది ప్రభుత్వ బెనిఫిట్స్ అందక మనోవేదనతో మరణించారని.. తమ ప్రభుత్వ హయాంలో 17 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయితే అందరికీ టైంకు డబ్బులు అందించామని ఆయన తెలిపారు. సిద్దిపేట నుంచి రిటైర్డ్ జేడీ వెటర్నరీ డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి కలిశారని, అక్టోబర్ 2024లో రిటైర్ అయితే ఇప్పటివరకు ఒక్క రూపాయి రాలేదని తనకు చెప్పారని హరీశ్​తెలిపారు. తక్షణమే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కోరారు. అలాగే, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్లీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందించాలని.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు పంపించిందని హరీశ్ గుర్తుచేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత పదేండ్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రతి నెలా 20 వరకు ఇచ్చేవారని విమర్శించారు. ఇపుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రతినెలా 5 లోపే ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టపడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జూబ్లీహిల్స్ లో సమస్యలు పరిష్కరించాలి: నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. రెండేండ్ల క్రితం సీఎం అసెంబ్లీలో తన పేరు ప్రస్తావించారని, ఇపుడు అసెంబ్లీలో అడుగుపెట్టానని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్​కు, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరించారని చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలోని కృష్ణానగర్​లో వర్షాకాలంలో వరదలు వస్తున్నాయని, హై టెన్షన్ విద్యుత్ వైర్లతో పలువురు చనిపోయారని నవీన్ యాదవ్ తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. బూతులు మాట్లాడడమే రాజకీయం అనుకోవద్దు: కాటిపల్లి ఉన్నత పదవుల్లో ఉన్న ప్రధాని, సీఎంను మర్యాదలేకుండా మాట్లాడుతున్నారని.. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. భాషను దిగజార్చుతున్నారని, ఏకవచనంతో పిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రికార్డుల నుంచి కూడా తొలగించలేని పరిస్థితి ఉందని, బయట మీడియాతో కూడా పలువురు నేతలు తప్పుగా మాట్లాడుతున్నారన్నారు. బూతులు మాట్లాడటమే రాజకీయం అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. కాటేపల్లి లేవనెత్తిన అంశం కీలకమైందన్నారు. బీఆర్​ఎస్​, బీజేపీలో ఉన్న సీనియర్లు కూడా ఇబ్బందిగా మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఇది అన్ని పార్టీలో ఉన్న సమస్య అని శ్రీధర్ బాబు తెలిపారు. రానున్న రోజుల్లో మంత్రులు, తమ ఎమ్మెల్యేలు సైతం గౌరవంగా మాట్లాడుతారని, ఎలాంటి భేషజాలు లేవని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మైక్ కట్ తన నియోజకవర్గంలో రాఘవ కంపెనీ నిర్మాణం చేసిన చెక్ డ్యామ్ ను పేల్చేశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డను కూడా బాంబులు పెట్టి పేల్చేరాని కౌశిక్ రెడ్డి అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే స్పీకర్.. కౌశిక్ రెడ్డి మైక్ కట్ చేశారు. అనంతరం బీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంగుల కమాలకర్ మాట్లాడారు. తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కర్నాటక, తమిళనాడుకు ప్రత్యేకంగా భవన్ లు ఉన్నాయని, ఈ అంశంపై ప్రభుత్వం చొరవ చూపి ఏపీ ప్రభుత్వం, టీటీడీ తో మాట్లాడాలని కోరారు.

Shiva

Admin

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :