Thursday, 15 January 2026 06:56:35 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

చరిత్ర సృష్టించిన డెవాన్ కాన్వే, టామ్ లాథమ్..

అన్‌స్టాపుబుల్ పార్టనర్‌షిప్.. టీమిండియా రికార్డ్ బద్ధలుగొట్టారుగా..

Date : 18 December 2025 09:16 PM Views : 58

జై భీమ్ టీవీ - క్రీడలు / : న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్లు డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ అద్భుత ప్రదర్శన చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన ప్లేయర్లుగా నిలిచారు. వీరిద్దరూ కలిసి 323 పరుగులు చేశారు. 95 ఏళ్ల నాటి న్యూజిలాండ్ రికార్డును కూడా అధిగమించారు ఈ ప్లేయర్లు. 2019లో టీమిండియా ప్లేయర్లు నమోదు చేసిన రికార్డును బద్ధలుగొట్టారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ కైవసం చేసుకోవాలని దూకుడు మీద ఉన్న కివీస్ జట్టు.. మూడో టెస్ట్ మ్యా‌చ్‌లోనూ అదరగొడుతోంది. మౌంట్ మౌంగనూయిలోని బే ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ ఎంచున్న న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి.. ఓపెనర్లు డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 95 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. విచిత్రం ఏంటంటే.. ఇటీవల అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో డెవాన్ కాన్వే అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. కానీ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆట ముగిసే సమయానికి 178 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు కివీస్ సారథి టామ్ లాథమ్ కూడా 137 పరుగులు బాదాడు. వీరిద్దరి పార్టనర్‌షిప్ 323 పరుగులకు చేరింది. అయితే ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. దీంతో 2019లో టీమిండియా ప్లేయర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ కలిసి చేసిన 317 పరుగుల పార్టనర్‌షిప్‌ను బద్ధలుగొట్టారు. ఇప్పుడు డబ్ల్యూటీసీ చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యాల జాబితాలో డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ తొలిస్థానంలో ఉన్నారు. డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ చేసిన పార్టనర్‌షిప్.. డబ్ల్యూటీసీ చరిత్రలోనే కాకుండా.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిచింది. 95 సంవత్సరాల క్రితం నాటి రికార్డును ఈ ప్లేయర్లు బ్రేక్ చేశారు. 1930లో చార్లెస్ స్టీవర్ట్ డెంప్స్టర్, జాన్ ఎర్నెస్ట్ మిల్స్.. ఇంగ్లాండ్‌పై 276 పరుగుల పార్టనర్‌షిప్‌ను నెలకొల్పారు. ఈ రికార్డును తాజాగా కాన్వే, లాథమ్ అధిగమించడం విశేషం. మొత్తంగా న్యూజిలాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో చూసుకుంటే.. వీరిద్దరిది రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. 1972లో గ్లెన్ టర్నర్, టెర్రీ జార్విస్ వెస్టిండీస్‌పై 387 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. మూడో టెస్టు మొదటి రోజు న్యూజిలాండ్‌కు ప్రత్యేకంగా మారింది. డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ ఆటతీరు.. వారు సాధించిన భాగస్వామ్యం ఆకట్టుకుంది. తమ అద్భుతమైన ప్రదర్శనతో న్యూజిలాండ్ జట్టు మొదటి రోజే వెస్టిండీస్‌పై పట్టు సాధించింది. ఈ ప్లేయర్లు సాధించిన ఈ ఘనత భవిష్యత్‌లో యంగ్ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పొచ్చు.

Shiva

Admin

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :