Thursday, 15 January 2026 08:22:18 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

మెస్సీ ఇష్యూతో బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా

మెస్సీ ఇష్యూతో బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా

Date : 17 December 2025 12:20 AM Views : 62

జై భీమ్ టీవీ - జాతియం / : కోల్‎కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్‎బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్ ఈవెంట్ సందర్భంగా జరిగిన గందరగోళానికి నైతిక బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ మంగళవారం (డిసెంబర్ 16) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి పంపారు. ఈ ఘటనపై స్వేచ్ఛగా, న్యాయంగా దర్యాప్తు జరిగేలా తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) కోల్‎కతాలోని సాల్ట్ లేక్ స్టేడియానికి మెస్సీ వెళ్లారు. ఈ గ్రౌండ్‎లో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో తమ అభిమాన ప్లేయర్ ఆటను కళ్లారా చూసేందుకు వేలకు వేలు పెట్టి టికెట్ కొని స్టేడియానికి తరలివచ్చారు ప్రేక్షకులు. కానీ మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయి. అంతేకాకుండా స్టేడియంలో మెస్సీ పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేదు. దీంతో మెస్సీ మ్యాచ్ ఆడతాడని ఆశించి వేలకు వేలు పెట్టి టికెట్లు కొన్న అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది. 12 వేలు పెట్టి టికెట్ కొంటే ఇలా ఉసూరుమనిపించడం దారుణమని గోట్ ఫ్యాన్స్ కోపంతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. కుర్చీలు విరగ్గొట్టారు. స్టేడియంలోకి వాటర్‌ బాటిళ్లు విసిరేసి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు ఫ్యాన్స్ బారికేడ్లు దాటుకొని లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగ ప్రవేశ చేసి అభిమానులను చెదరగొట్టారు. ఫ్యాన్స్‌ ఆవేశంగా ఉండటంతో మెస్సీ టీమ్‌ సొరంగం ద్వారా బయటకు వెళ్లిపోయారు. మెస్సీ ఈవెంట్లో గందరగోళం నెలకొనడంతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ దేశాల ముందు బెంగాల్‎తో పాటు యావత్ దేశం పరువు తీశారంటూ మమతా సర్కార్‎పై విమర్శలు వర్షం కురిపించింది. మెస్సీ ఈవెంట్ అట్టర్ ఫ్లాఫ్ కావడంతో ప్రేక్షకులకు మమతా బెనర్జీ బహిరంగా క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై ఆమె ప్రత్యేక విచారణకు ఆదేశించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :