Thursday, 15 January 2026 08:23:09 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

20 ఏళ్ల కుర్ర క్రికెటర్.. ఐపీఎల్ వేలంలో సంచలనం.. రూ.14.2 కోట్లు పలికాడు

IPL

Date : 16 December 2025 05:50 PM Views : 55

జై భీమ్ టీవీ - జాతియం / : న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 మినీ వేలంలో సంచలనం నమోదైంది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 20 ఏళ్ల కుర్ర క్రికెటర్ ప్రశాంత్ వీర్ కళ్లు చెదిరే ధర పలికాడు. రూ.14.2 కోట్ల భారీ ధరకు ప్రశాంత్ వీర్‎ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. తద్వారా వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా ప్రశాంత్ వీర్ రికార్డ్ సృష్టించాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‎తో వేలంలోకి వచ్చిన ఈ ఆల్ రౌండర్‎ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ముఖ్యంగా సీఎస్కే, ఎస్ఆర్‎హెచ్ పోటా పోటీగా ధర పెంచుకుంటూపోయాయి. రూ.14 కోట్ల దగ్గర హైదరాబాద్ వెనక్కి తగ్గగా.. రూ.14.2 కోట్లకు ప్రశాంత్ వీర్‎ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించడం ద్వారా ప్రశాంత్ వీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించాడు. ఈ క్రమంలోనే వేలంలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాడు ఈ యువ క్రికెటర్. ఉత్తరప్రదేశ్‎కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్ వీర్ ఆల్ రౌండర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‎తో పాటు హార్డ్ హిట్టింగ్ చేయగలడు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలా ఆడగల సత్తా ఉంది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్‌లో వచ్చి భారీ షాట్లు కొట్టగలడు. ఇటీవల టీ20 ఫార్మాట్‎లో జరిగిన దేశవాళీ లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో 10 బంతుల్లో 37 రన్స్ కొట్టి, 3 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతోనే ఈ ఆల్ రౌండర్‎పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రశాంత్ వీర్‎ను కొనుగోలు చేసి రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే మినీ వేలంలో ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ ప్రశాంత్ వీర్ ను రూ.14.2 కోట్ల భారీ ధరకు సీఎస్కే దక్కించుకుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :