Thursday, 15 January 2026 06:54:05 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

మెగాస్టార్ డైరెక్టర్‌తో మాస్ మహరాజా మూవీ...

తొలిసారి ఆ జోనర్‌లోకి ఎంట్రీ!

Date : 17 December 2025 12:43 AM Views : 61

జై భీమ్ టీవీ - సినిమా / : వరుస పరాజయాలతో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మాస్ మహారాజా రవితేజ మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘బింబిసారా’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వశిష్టతో కలిసి ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల వశిష్ట రవితేజకు కథ వినిపించగా, ఆయనకు కాన్సెప్ట్ నచ్చినట్లు సమాచారం. ‘కల్కి 2898 ఏడీ’ తర్వాత సై-ఫై జానర్‌పై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముందని, సినిమా షూటింగ్ 2026 మధ్యలో ప్రారంభమవుతుందనే చర్చ సాగుతోంది. టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌, డైలాగ్ డెలివరీ, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే శైలితో ఆయన ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా రవితేజ కెరీర్ మాత్రం ఊగిసలాటలో ఉంది. ఇటీవల వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో ఆయన గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో రవితేజ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో రవితేజ పేరు యువ దర్శకుడు వశిష్టతో కలిసి వినిపించడం ఆసక్తికరంగా మారింది. వశిష్ట అంటే టాలీవుడ్‌కు ‘బింబిసారా’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు. తొలి సినిమాతోనే ఫాంటసీ, టైమ్ ట్రావెల్ అంశాలను కమర్షియల్‌గా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న వశిష్ట, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన అసలు పేరు మల్లిడి వెంకట నారాయణ రెడ్డి. వశిష్ఠ తండ్రి మల్లిడి సత్యనారాయణ రెడ్డి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా పేరొందారు. దర్శకుడిగా మారకముందు వశిష్ట ‘ప్రేమలేఖ’ సినిమాతో నటుడిగా కూడా పరిచయం అయ్యారు. ఆ తర్వాత దర్శకత్వం వైపు మళ్లి తన ప్రతిభను పూర్తి స్థాయిలో చూపించారు. ‘బింబిసారా’ విజయం తర్వాత వశిష్ట కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి వెళ్లింది. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’ను తెరకెక్కిస్తున్నారు. సోషియో-ఫాంటసీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. చిరంజీవి వంటి స్టార్‌తో సినిమా చేస్తున్నా, తన కథలపై ఉన్న నమ్మకాన్ని వశిష్ట ఎక్కడా తగ్గించలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడీ వశిష్ఠ-రవితేజ కలసి ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ విజయం తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో సై-ఫై జోనర్‌పై ఆసక్తి పెరిగింది. ఈ తరుణంలో రవితేజ – వశిష్ట కాంబినేషన్‌లో ఓ సై-ఫై ప్రాజెక్ట్ తెరపైకి రానుందన్న ప్రచారం ఉత్సుకతను రేపుతోంది. ఇటీవల వశిష్ట రవితేజకు ఓ స్టోరీ నెరేషన్ ఇచ్చారని, కథ నచ్చడంతో మాస్ మహారాజా ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సినిమా పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, కమర్షియల్ అంశాలతో పాటు కొత్త కాన్సెప్ట్‌ను మేళవించి తెరకెక్కించాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నారని టాక్. రవితేజ ఇమేజ్‌కు తగ్గ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, సై-ఫై టచ్‌ను బ్యాలెన్స్ చేసేలా కథను రూపొందిస్తున్నారట. అధికారిక ప్రకటన ఇంకా రాలేకపోయినా, ఈ సినిమా షూటింగ్ 2026 సెకండాఫ్‌లో ప్రారంభమయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల వచ్చిన ‘మాస్ జాతర’ మూవీ డిజాస్టర్ కావడంతో ఈ సినిమా ఫలితం ఆయన కెరీర్‌కు కీలకంగా మారనుంది. మరోవైపు వశిష్ట ‘విశ్వంభర’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత రవితేజ – వశిష్ట సైన్స్ ఫిక్షన్ సినిమా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న మాస్ మహారాజాకు, వశిష్టతో సినిమా ఒక కొత్త మలుపు తిప్పుతుందా? టాలీవుడ్‌లో మరో సై-ఫై సెన్సేషన్ క్రియేట్ కాబోతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :