Thursday, 15 January 2026 06:56:17 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

2025లో కోలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్‌దే హవా... పరువు పోగొట్టుకున్న టాలీవుడ్

2025లో కోలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్‌దే హవా... పరువు పోగొట్టుకున్న టాలీవుడ్

Date : 17 December 2025 12:57 AM Views : 60

జై భీమ్ టీవీ - సినిమా / : 2025లో భారతీయ సినిమా రంగంలో భారీ చిత్రాల పోటీ తీవ్రంగా కనిపించినా, బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల మార్క్‌ను దాటిన తెలుగు సినిమా మాత్రం కనిపించలేదు. బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ పరిశ్రమలకు చెందిన చిత్రాలు భారీ వసూళ్లతో రికార్డులు నెలకొల్పాయి. కన్నడ చిత్రం ‘కాంతారా: చాప్టర్ 1’, తలైవా నటించిన ‘కూలీ’, బాలీవుడ్ హిట్లు ‘ఛావా’, ‘సైయారా’, ‘దురంధర్’ 500 కోట్లకు పైగా గ్రాస్ సాధించాయి. ఇక టాలీవుడ్‌లో ఈ ఏడాది టాప్ గ్రాసర్‌గా నిలిచిన సినిమాలు 300 కోట్ల వరకే పరిమితమయ్యాయి. ఏటా భారతీయ సినిమా రంగంలో భారీ అంచనాలతో ఎన్నో చిత్రాలు థియేటర్లలోకి వస్తుంటాయి. కొన్ని సినిమాలు తమ తమ భాషల పరిధిని దాటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే, మరికొన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడతాయి. 2025 సంవత్సరంలో కూడా ఇలాంటి భారీ చిత్రాల పోటీ గట్టిగానే కనిపించింది. బాలీవుడ్ , కోలీవుడ్ , శాండిల్‌వుడ్ చిత్రాలు వరుసగా భారీ వసూళ్లతో దూసుకెళ్లగా, టాలీవుడ్ మాత్రం ఈ ఏడాది ఆ రేంజ్‌లో మెరుపులు మెరవలేకపోయింది. ముఖ్యంగా 500 కోట్ల క్లబ్ విషయంలో తెలుగు సినిమా వెనుకబడి ఉండటం అభిమానులను నిరాశకు గురి చేసింది. 2025 సంవత్సరం మొత్తాన్ని పరిశీలిస్తే, పలు భాషల సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించాయి. ఈ ఏడాది మొత్తం ఐదు సినిమాలు 500 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం. ఇందులో బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ పరిశ్రమలకు చెందిన చిత్రాలే చోటు దక్కించుకున్నాయి. అక్టోబర్ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించిన ‘కాంతారా: చాప్టర్ 1’ భారీ స్పందనను అందుకుంది. తొలి భాగానికి వచ్చిన క్రేజ్‌కు తగ్గట్టే ఈ ప్రీక్వెల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని, ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక కోలీవుడ్ నుంచి వచ్చిన భారీ చిత్రం ‘కూలీ’ కూడా ఈ ఏడాది టాప్ గ్రాసర్స్ జాబితాలో నిలిచింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలై, దాదాపు 580 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్ సత్తాను మరోసారి చాటింది. బాలీవుడ్ విషయానికి వస్తే, ఈ ఏడాది అక్కడి చిత్రాలు బాక్సాఫీస్‌ను ఊపేశాయి. కొత్త హీరో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా ‘సైయారా’ ఊహించని స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 570 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అలాగే ఫిబ్రవరి 14, 2025న విడుదలైన ‘ఛావా’ బాలీవుడ్‌కు ఈ ఏడాది అతిపెద్ద హిట్‌గా నిలిచింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించగా, రష్మిక మందానా కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక ఏడాది చివర్లో విడుదలైన రణవీర్ సింగ్ సినిమా ‘దురంధర్’ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. డిసెంబర్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్ని భారీ విజయాల మధ్య టాలీవుడ్ పరిస్థితి మాత్రం నిరాశాజనకంగా మారింది. 2025లో ఇప్పటివరకు విడుదలైన తెలుగు సినిమాల్లో ఏ ఒక్కటి కూడా 500 కోట్ల మార్క్‌ను దాటలేకపోయింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాప్ గ్రాసర్‌గా నిలిచినా, ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా అదే స్థాయిలో ఆగిపోయాయి. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నా రూ.300 కోట్ల వద్దే ఆగిపోయింది. గతేడాది ‘పుష్ప 2’, ‘కల్కి’ లాంటి చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరిన నేపథ్యంలో, ఈ ఏడాది అలాంటి ఘన విజయం లేకపోవడం తెలుగు అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. అయితే 2026లో పరిస్థితి మారుతుందనే ఆశలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి బరిలో పలువురు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’, రామ్‌చరణ్ ‘పెద్ది’, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ 2026లో విడుదల కానున్నాయి. దీంతో వచ్చే ఏడాది కనీసం రెండు సినిమాలైనా 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడతాయని సినీ లవర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2025లో వెనుకబడ్డ టాలీవుడ్, 2026లో తిరిగి తన సత్తా చాటుతుందా అన్నది కాలమే చెప్పాలి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :