Thursday, 15 January 2026 06:55:33 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

Peddi: ‘పెద్ది’ దెబ్బకి యూట్యూబ్‌ షేక్... తెలుగులో సెంచరీ కొట్టిన ‘చికిరి’ సాంగ్!

Peddi: ‘పెద్ది’ దెబ్బకి యూట్యూబ్‌ షేక్... తెలుగులో సెంచరీ కొట్టిన ‘చికిరి’ సాంగ్!

Date : 17 December 2025 12:46 AM Views : 63

జై భీమ్ టీవీ - సినిమా / : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన తొలి సింగిల్ ‘చికిరి చికిరి’ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన నెలలోనే తెలుగు వెర్షన్ 100 మిలియన్ వ్యూస్‌ను దాటగా, అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. ఏఆర్ రెహమాన్ అందించిన ఎనర్జిటిక్ ట్యూన్, రామ్ చరణ్ పవర్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు వినిపిస్తేనే టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలాంటి చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ పెద్ది ’ ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ‘ఉప్పెన’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, కథ, స్కేల్, టెక్నికల్ వాల్యూస్ అన్నింట్లోనూ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్‌ను పక్కా మాస్ అవతార్‌లో చూపించనున్న ఈ సినిమాలో ఆయన లుక్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వాములుగా ఉండటం సినిమాకు మరింత బలం చేకూరుస్తోంది. చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి విడుదలైన తొలి పాట ‘చికిరి చికిరి’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పాట విడుదలైన నాటి నుంచి సోషల్ మీడియా, యూట్యూబ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సాంగ్‌కు విపరీతమైన స్పందన లభిస్తోంది. రెహమాన్ అందించిన ఎనర్జిటిక్ బీట్‌లు, క్యాచీ ట్యూన్ ఈ పాటను ప్రతి వర్గం ప్రేక్షకులకు దగ్గర చేసింది. ముఖ్యంగా రామ్ చరణ్ చూపించిన ఎనర్జీ, పవర్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేశాయి. ఆయన స్టెప్స్‌ను అనుకరిస్తూ వేల సంఖ్యలో రీల్స్, షార్ట్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వ్యూస్ పరంగా కూడా ‘చికిరి చికిరి’ పాట సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. కేవలం ఒక నెల వ్యవధిలోనే తెలుగు వెర్షన్ ఒక్కటే 100 మిలియన్ల వ్యూస్‌ను దాటడం విశేషంగా మారింది. అంతేకాదు, ఐదు భాషల్లో విడుదలైన ఈ పాట అన్ని వెర్షన్లను కలుపుకుని చూస్తే 150 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. ఈ స్థాయి స్పందన రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. పాటపై వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, సినిమా రిలీజ్‌కు ముందే ‘పెద్ది’ పేరు దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ పాటను తెరకెక్కించిన విధానం కూడా ప్రత్యేక ప్రశంసలు అందుకుంటోంది. ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే విజువల్ గ్రాండియర్, లొకేషన్ ఎంపిక, కెమెరా వర్క్ పాటకు మరింత ఎలివేషన్ ఇచ్చాయి. భారీ సెట్స్‌, స్టైలిష్ మేకింగ్‌తో ఈ సాంగ్‌ను తెరకెక్కించడంతో, ఇది కేవలం పాటగానే కాకుండా ఒక విజువల్ ఫీస్ట్‌గా మారింది. ఈ పాటే సినిమా టోన్‌ను స్పష్టంగా తెలియజేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘చికిరి’ పాట సాధించిన ఘన విజయం కారణంగా ‘పెద్ది’ సినిమాపై ప్రీ-రిలీజ్ హైప్ పీక్స్‌కు చేరింది. ఇప్పటికే షూటింగ్ పనులు వేగంగా సాగుతుండగా, కొన్ని కీలక సన్నివేశాలను ఢిల్లీలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జనవరి చివరి నాటికి టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తిగా ఫోకస్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. షూటింగ్‌తో పాటు ఎడిటింగ్, విజువల్ వర్క్‌ను సమాంతరంగా నిర్వహిస్తూ వర్క్‌ఫ్లోను వేగవంతం చేస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ భారీ స్థాయిలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాను 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా వాయిదా పడబోతోందంటూ రూమర్లు వినిపిస్తున్నా మేకర్స్ వాటిని పట్టించుకోవడం లేదు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :