Thursday, 15 January 2026 06:54:10 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

అయ్యగారి కోసం బాలీవుడ్ బ్యూటీ.. అదిరిపోయేలా ఐటెమ్ సాంగ్ ప్లాన్!

అయ్యగారి కోసం బాలీవుడ్ బ్యూటీ.. అదిరిపోయేలా ఐటెమ్ సాంగ్ ప్లాన్!

Date : 17 December 2025 01:02 AM Views : 66

జై భీమ్ టీవీ - సినిమా / : వరుస పరాజయాల తర్వాత అఖిల్ అక్కినేని గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని ‘లెనిన్’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మురళీ కే కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై లేటెస్ట్‌గా హాట్ బజ్ వినిపిస్తోంది. సినిమాలో ఒక భారీ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను ఎంపిక చేసినట్టు టాక్. అఖిల్‌తో కలిసి ఆమె డ్యాన్స్ చేయనుందని, చిన్న అతిథి పాత్ర కూడా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్‌లో అక్కినేని వారసుడిగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కెరీర్ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. 2015లో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన పదేళ్లలో ఐదు సినిమాల్లో నటించగా ఒక్క హిట్ కూడా దక్కలేదు. స్టార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, సరైన కథలు పడకపోవడం, వరుస పరాజయాలు ఆయన కెరీర్ గ్రాఫ్‌ను కిందికి లాగాయి. ముఖ్యంగా ‘ఏజెంట్’ సినిమా ఘోర పరాజయం కావడం అఖిల్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఆ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల పాటు బ్రేక్ తీసుకున్న అఖిల్, తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసినట్టు కనిపిస్తోంది. భారీ హిట్‌తో ఇండస్ట్రీకి తన సత్తా చూపించాలన్న లక్ష్యంతో ‘లెనిన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ‘లెనిన్’ అఖిల్ కెరీర్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా మారింది. ఈ చిత్రానికి మురళీ కే కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి పూర్తిగా మాస్, యాక్షన్ డ్రామా జానర్‌లో అఖిల్‌ను కొత్తగా చూపించబోతున్నారని సమాచారం. గత సినిమాల్లా కాకుండా, డీ-గ్లామర్ లుక్‌లో, పక్కా లోకల్ రా క్యారెక్టర్‌లో అఖిల్ కనిపించనున్నాడని టాక్. దీంతో ఈసారైనా అఖిల్ హిట్ కొట్టగలడా లేదా అన్న ఆసక్తి అభిమానుల్లో బాగా పెరిగింది. అక్కినేని కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు, టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. నాగార్జున, నాగవంశీ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ప్రాజెక్ట్ స్థాయి అమాంతం పెరిగింది. కథ, టెక్నికల్ విలువల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ‘లెనిన్’ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ హాట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఒక భారీ మాస్ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే ను ఎంపిక చేసినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్లామర్, డ్యాన్స్‌కు మంచి క్రేజ్ ఉన్న అనన్య పాండే ఈ స్పెషల్ సాంగ్‌లో అఖిల్‌తో కలిసి స్టెప్పులు వేయనుందని టాక్. అంతేకాదు, కేవలం పాటకే కాకుండా సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో కూడా ఆమె కనిపించే అవకాశముందని సమాచారం. అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో అనన్యకు తెలుగు మేకర్స్ ఆమెను పట్టించుకోలేదు. మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్ నుంచి ఆమెకు పిలుపు వెళ్లింది. తెలుగులో అఖిల్ – అనన్య పాండే కాంబినేషన్ ఇప్పటివరకు చూడనిది కావడంతో, ఈ జోడీ తెరపై ఎలా కనిపిస్తుందోనన్న ఆసక్తి యూత్‌లో ఎక్కువగా ఉంది. ఈ స్పెషల్ సాంగ్‌ను భారీ సెట్స్‌, గ్రాండ్ స్కేల్‌లో షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కథ విషయానికి వస్తే, ‘లెనిన్’ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతానికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. లోకల్ ఎమోషన్స్, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయని సమాచారం. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మొదట ఈ పాత్రకు శ్రీలీలను తీసుకున్నారు. ఫస్ట్ గ్లింప్స్‌లో ఆమె కనిపించింది కూడా అయితే కొన్ని కారణాలతో శ్రీలీలను తప్పించిన మేకర్స్ భాగ్యశ్రీని ఫైనల్ చేశారు. మ్యూజిక్ విషయానికొస్తే, ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ‘లెనిన్’ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారని సమాచారం. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా గట్టిగా హిట్ కొట్టాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. మరి ‘లెనిన్’ అఖిల్‌కు లైఫ్ ఇచ్చే సినిమాగా మారుతుందా? లేదా అనే ప్రశ్నకు సమాధానం రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :