Thursday, 15 January 2026 08:36:53 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

ఏపీలో ఆ జాతీయ రహదారికి మహర్దశ..

ఆ ప్రాంతంలో 4 ఫ్లై ఓవర్లు, 14 అండర్‌పాస్‌లు

Date : 16 December 2025 11:44 PM Views : 42

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / అనంతపూర్ జిల్లా : అనంతపురం మీదుగా వెళ్లే హైదరాబాద్-బెంగళూరు హైవే 44పై ప్రమాదాలు తగ్గించేందుకు NHAI భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. రూ.600 కోట్లతో 14 అండర్‌పాస్‌లు, 4 ఫ్లైఓవర్లు, ఒక ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. దీంతో పాటు నేషనల్ హైవే 44పై ఉన్న ఆక్రమణలను తొలగించే పని కూడా మొదలైంది.. ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఈ చర్యలతో ప్రయాణికులకు భద్రత పెరిగి, ప్రయాణం సులభతరం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై భద్రత, ప్రమాదాల నివారణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ హైవేలలో అవసరమైన చోట్ల కొత్తగా అండర్ పాస్‌ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా మీదుగా వెళ్లే హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44పై అవసరమైన నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. NHAI (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) కీలక చర్యలు చేపట్టింది. ఈ జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను (బ్లాక్‌స్పాట్స్) గుర్తించి.. అవసరమైన చోట్ల అండర్‌పాస్‌ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్‌లు నిర్మించనున్నారు. ఈ మేరకు రూ.600 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో మొత్తం 14 అండర్‌పాస్‌ బ్రిడ్జిలు, 4 ఫ్లైఓవర్‌లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం దగ్గర ప్రజలు నడిచేందుకు వీలుగా ఒక ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని కూడా నిర్మించనున్నారు. రాప్తాడు, సోమందేపల్లి, తపోవనం, కోడూరు దగ్గర 4 ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఈ నిర్మాణాల కోసం డీపీఆర్‌ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే, వాహనాల రాకపోకలు సజావుగా సాగడంతో పాటు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ చర్యల వల్ల ప్రయాణికులకు భద్రత పెరిగి, ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. నేషనల్ హైవే 44పై ఆక్రమణల తొలగింపు ప్రక్రియ మరోవైపు ఈ జాతీయ రహదారి 44పై పెద్ద, పెద్ద హోటల్స్ ప్రసన్నాయపల్లి దగ్గర స్థలాన్ని ఆక్రమించాయి.. నిర్మాణాలు చేశారు. ఈ మేరకు ఆ హోటళ్ల యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ఆక్రమణల్ని కూడా తొలగించాలని ప్రయత్నించారు.. జేసీబీలతో వెళ్లారు. అయితే హోటళ్ల యాజమాన్యాలు కొంత గడువు కోరారు.. మరికొందరు తమకు అసలు నోటీసులే రాలేదని చెప్పడ కొసమెరుపు. కొంతమంది మాత్రం కోర్టును ఆశ్రయించారు. ప్రసన్నాయపల్లితో పాటుగా కోడూరు, సోములదొడ్డి దగ్గర కూడా ఆక్రమణలు ఉన్నాయని గుర్తించారు.. వారికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇలా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి జాతీయ రహదారిపై ఉన్న స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు.

Shiva

Admin

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :