జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / కర్నూల్ జిల్లా : దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల నెట్‌వర్క్‌ను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లకు ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది. హైదరాబాద్- బెంగళూరు కారిడార్‌కు సంబంధించి ఏపీలో ఉన్న 263 కిలోమీటర్ల మార్గంలో పలు చోట్ల మట్టి నమూనాలు సేకరించే పనులు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే గంటకు 320 కిలోమీటర్ల వేగంతో కర్నూలు నుంచి బెంగళూరుకు కేవలం గంట 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఏపీలో బుల్లెట్ రైలు ప్రాథమిక సర్వే ఏపీలో పలు చోట్ల మట్టి సేకరణ పనులు 320 కిలోమీటర్ల వేగంతో, గంటన్నరలో బెంగళూరుకు దేశంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టి మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా ప్రపంచంతో పోటీ పడేలా బుల్లెట్ రైళ్లు తీసుకొస్తోంది. ఇప్పుటికేముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో బుల్లెట్ రైళ్ల నెట్‌వర్క్ మరింత విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్- బెంగళూరు కారిడార్లను ప్రకటించింది. ఈ రెండు బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు దాదాపు రూ. 5.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ క్రమంలో హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు సంబంధించి ప్రాథమిక సర్వే పనులు ప్రారంభం అయ్యాయి. మట్టి పరీక్షలు.. హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్ మొత్తం పొడవు 605 కిలోమీటర్లు. ఇందులో 263 కిలోమీటర్ల మార్గం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా ఈ మార్గం ఉంది. ఈ కారిడార్‌కు సంబంధించి ప్రాథమిక సర్వే పనులు ప్రారంభమయ్యాయి. బుల్లెట్ రైళ్లు పరుగెత్తడానికి అనువైన ట్రాక్ నిర్మాణం కోసం.. ఏపీలో పలు చోట్ల మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. ఈ సర్వే పూర్తయ్యాక తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది. బుల్లెట్ రైలు గరిష్ఠ వేగం గంటకు 350 కిలోమీటర్లు. భద్రతా కారణాల రీత్యా 320 కిలోమీటర్ల వేగంతోనే నడుపుతారు. ఈ వేగం తట్టుకునేలా అనువైన ట్రాక్ నిర్మించాల్సి ఉంటుంది. నిర్దేశించిన వేగంతో బుల్లెట్ రైలు దూసుకెళ్లాలంటే.. ట్రాక్ పటిష్ఠంగా ఉండాలి. అందుకోసం సాయిల్ టెస్టింగ్ (మట్టి పరీక్షలు) చేస్తారు. ట్రాక్ నిర్మించే ప్రదేశంలో జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు చేస్తారు. డ్రిల్లింగ్ చేసి మట్టి, బండరాళ్ల నమూనాలు సేకరిస్తారు. అనంతరం ఆ మట్టి ఏ రకానికి చెందింది, అందులో తేమ ఎంత మేర ఉంది, స్వెల్ ప్రెషర్ (swelling pressure) ఎంత ఉందని విశ్లేషిస్తారు. బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణంలో మట్టి పరీక్షల వివరాలు కీలకం. ఏయే ప్రాంతాల్లో ఎలివేటెడ్ మార్గాలు, సొరంగాలు, నిర్మించాలో దీన్ని బట్టే నిర్ణయిస్తారు. గంటన్నరలో బెంగళూరు వెళ్లొచ్చు.. ఈ బుల్లెట్ రైలుఅందుబాటులోకి వస్తే.. ఉమ్మడి కర్నూలు వాసులు బెంగళూరుకు మరింత వేగంగా వెళ్లొచ్చు. కర్నూలు- బెంగళూరు మధ్య దూరం 427 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లాలంటే.. 5.30 గంటల సమయం పడుతోంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కర్నూలు నుంచి బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్‌కు.. గంట 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.
Admin