జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖపట్నం ఐటీ రంగంలో దూసుకుపోతోంది! గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ కోసం భూమి అడుగుతోంది.. ప్రభుత్వంతో చర్చించగా సానుకూలత వచ్చింది. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్, సిఫీ డేటా సెంటర్లు కూడా వస్తున్నాయి. పరిశ్రమలు కూడా అనకాపల్లి వైపు పరుగులు తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు దిగ్గజ ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి.. విశాఖపట్నానికి గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌తో పాటుగా మరికొన్ని కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. ఆయా కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. తాజాగా ఇన్ఫోసిస్ కూడా విశాఖపట్నంలో శాశ్వతంగా క్యాంపస్ ఏర్పాటు చేయాలని భావిస్తోందట. అందుకే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా.. సూత్రప్రాయకంగా అంగీకరించినట్లు సమాచారం. ఎండాడ దగ్గర 20 ఎకరాలు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ ప్రతినిధులతో చర్చించారని.. ఈ నెలలో ఒక క్లారిటీ వస్తుందంటున్నారు.. అలాగే ఈ సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ అంశాలపై అధికారికంగా ప్రకటన చేయనున్నారట.
Admin