Thursday, 15 January 2026 08:35:30 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

ఉత్తరాంధ్రను వణికిస్తున్న కొత్త వ్యాధి..

ఇలా చేయకుంటే చాలా ప్రమాదం!

Date : 16 December 2025 11:58 PM Views : 44

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి కలకలం సృష్టిస్తోంది. వారం రోజుల్లో ఏడు కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో తొమ్మిది నెలల శిశువు కూడా ఉంది. అయితే ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లార్వల్ మైట్స్ అనే పురుగులు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని.. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు వంటి లక్షణాలు మూడు రోజులకు పైగా ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాను స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి వణిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాదాపు వారం రోజుల్లోనే ఏడు కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే మూడు మండలాల్లోని ఏడు గ్రామాల్లో ఒక్కొక్కరు ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. దాశరథిపురం, కడుము, అక్రాపల్లి, అంబావల్లి గ్రామాలకు చెందిన వారికి ఈ వ్యాధి సోకింది. ఇందులో ఒక 9 నెలల శిశువు కూడా ఉంది. స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి అంటే ఏంటి? స్క్రబ్‌ టైఫస్‌ లేదా బుష్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చిన్నపాటి లార్వల్ మైట్స్ (larval mites) అనే పురుగు కుట్టడం ద్వారా వస్తుంది. ఇలాంటి పురుగులు ఎక్కువగా వ్యవసాయ భూములు, కొండ ప్రాంతాల్లో ఉంటాయి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, చెత్త, పనికిరాని మొక్కలు, తేమ, మురుగు ఉన్న ప్రదేశాల్లో స్క్రబ్ టైఫస్ పురుగు ఉంటుంది. కాబట్టి.. అలాంటి ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. శీతకాలంలో ఈ వ్యాధి ప్రభావం ( What is the cause of scrub typhus ) ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మూడేళ్ల కిందట- 2022లో కూడా లావేరు మండలం అప్పాపురం గ్రామస్థులకు కూడా ఈ వ్యాధి సోకింది. అనంతరం అధికారులు రంగంలోకి దిగి.. పారిశుద్ధ్య చర్యలు చేపట్టి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో.. ఈ స్క్రబ్ టైఫస్ నియంత్రణలోకి వచ్చింది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు.. లార్వల్ మైట్స్ పురుగులు కుట్టిన ప్రదేశంలో నల్లగా అవుతుంది. చర్మం ఎరుపెక్కి చిన్నపాటి దద్దుర్లు వస్తాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకితే.. దగ్గు, జ్వరం, జలుబు, ( scrub typhus symptoms ) నీరసం, కీళ్ల, తలనొప్పులతో బాధపడతారు. శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే.. వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే జ్వరం తీవ్రమవడంతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు, పచ్చకామెర్లు, రక్తం గడ్డకట్టడం, శ్వాసకోస ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు, మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా చేయకుంటే చాలా ప్రమాదం! స్క్రబ్ టైఫస్ వ్యాధి రాకుండా ఉండాలంటే.. ముందుగా లార్వల్ మైట్స్ పురుగులను దగ్గరికి రానివ్వొద్దు. అందుకోసం చెత్త పేరుకుపోకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో పొడి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తడిసిన దుస్తులు వేసుకోవవద్దు. కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు వేసుకోవాలి. పొలాల్లో పనిచేసేటప్పుడైనా, ఇంట్లో ఉన్న సమయంలోనైనా ఏదైనా పురుగు కుట్టినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ వ్వాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా.. చిన్న పురుగే కదా అని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Shiva

Admin

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :