జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం సమీపంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు విశాఖపట్నంలో కార్యక్రమం నిర్వహించారు.. మంత్రి లోకేష్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, జీఎంఆర్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు నేతలు పాల్గొన్నారు. జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యు సిటీగా పిలువబడే ఈ ప్రాజెక్టులో జీఎంఆర్ గ్రూప్, మాన్సాస్ ట్రస్ట్ కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సాగర తీర నగరంలో ఓ వైపు ఐటీ కంపెనీలను తీసుకొస్తూనే.. మిగిలిన రంగాలపై కూడా ఫోకస్ పెట్టింది. తాజాగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో సరికొత్తగా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు దిశగా ముందడుగు వేసింది. విశాఖపట్నం-విజయనగరం సరిహద్దులో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి శ్రీకారం చుట్టారు.. ఈ ప్రాజెక్టుకు జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యు సిటీగా పేరు పెట్టారు. ఈ సిటీ ప్రాజెక్టులో గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, జీఎంఆర్ గ్రూప్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇవాళ విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, జీఎంఎఆర్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
Admin