Saturday, 18 May 2024 10:08:37 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కేసీఆర్ ఖేల్ ఖతం - బీఆర్ఎస్ దుఖాన్ బంద్

Date : 28 August 2023 01:41 PM Views : 125

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్: తాజాగా విడుదల చేసిన దళిత డిక్లరేషన్‌పై అధికార పక్షం చేస్తున్న విమర్శలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమ డిక్లరేషన్ దళితుడిని సీఎం చేస్తానని మోసగించడం లాంటిది కాదని.. గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్ అని రేవంత్ తెలిపారు. ‘‘మా డిక్లరేషన్ దళిత - గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్. 1. మా డిక్లరేషన్ … దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు. 2. మా డిక్లరేషన్… ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు. 3. మా డిక్లరేషన్… గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదు. 4. మా డిక్లరేషన్… మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటిది కాదు. 5. మా డిక్లరేషన్ … నేరెళ్ళ ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత - బీసీ బిడ్డల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదు. 6. మా డిక్లరేషన్… దళిత - గిరిజనులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం లాంటిది కాదు. 7. మా డిక్లరేషన్… దళిత మహిళ మరియమ్మను లాకప్ డెత్ చేయించడం లాంటిది కాదు. 8. మా డిక్లరేషన్… ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకుని ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటిది కాదు. 9. మా డిక్లరేషన్… ఎబిసిడి వర్గీకరణ చేయకుండా మోసం చేయడం లాంటిది కాదు. 10. మా డిక్లరేషన్… దళితబంధు పథకంలో 30 శాతం కమీషన్లకు కక్కుర్తిపడే రాబందుల లాంటిది కాదు. అందుకే… యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే’’ అన్నారు. ఫైనల్‌గా “కేసీఆర్ ఖేల్ ఖతం - బీఆర్ఎస్ దుఖాన్ బంద్” అనే నినాదాన్ని ఇచ్చారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :