Saturday, 18 May 2024 10:08:35 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మాకొద్దు బాబోయ్ ఈ పోలీస్ స్టేషన్ ..! పోస్టింగ్‌ అంటే ఇష్టమే గానీ,.. అక్కడికి వెళ్లాలంటేనే..?!

Date : 07 October 2023 02:43 PM Views : 76

జై భీమ్ టీవీ - తెలంగాణ / : Hyderabad: అదనంగా ఆ ఏరియాలో వ్యాపారాలు కూడా ఎక్కువగానే ఉండటంతో మామూళ్లు కూడా ఎక్కువగానే దన్నుకోవచ్చు అనే ధోరణిలో ఉన్న ఇన్ స్పెక్టర్లు మాత్రం బంజారాహిల్స్ పోస్టింగ్ కోసం ఎన్నో పైరవీలు చేసుకుంటున్నారు.. ఇక మరి కొంతమంది పోలీస్ ఇన్‌ స్పెక్టర్లు మాత్రం బంజారాహిల్స్ తప్ప ఎక్కడ ఇచ్చినా తమకు ఓకే అంటూ లెటర్ లతో కాక పడుతున్నారు. మాకు లూప్ లైన్ పోస్టింగ్ అయిన ఇవ్వండి.. కానీ బంజారాహిల్స్ మాకొద్దు బాబోయ్‌, ఆ తలనొప్పి మాకెందుకంటూ మరికొంత మంది వాపోతున్నారు.. మాకొద్దు బాబోయ్ ఈ పోలీస్ స్టేషన్ ..! పోస్టింగ్‌ అంటే ఇష్టమే గానీ,.. అక్కడికి వెళ్లాలంటేనే..?! హైదరాబాద్, అక్టోబర్07; హైదరాబాద్ సిటీలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఉన్న క్రేజే వేరు. ఒకప్పుడు బంజారాహిల్స్ పోస్టింగ్ అంటేనే సిటీలోనే కాదు రాష్ట్రంలోనే నంబర్ వన్ పోలీస్ స్టేషన్ గా ఉండేది. అలాంటి పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ గా పోస్టింగ్ అంటేనే రాష్ట్రస్థాయిలో ఆ అధికారులకు ఉండే డిమాండ్ వేరు.. అలాంటి హాట్ కేక్ లాంటి పోలీస్ స్టేషన్ కు గత కొన్ని సంవత్సరాల నుండి నిత్య వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.. అసలే వెస్ట్ జోన్ ఆపై వీఐపీ ఏరియా వందల కొద్ది పబ్బులు మసాజ్ సెంటర్ లు … అన్ని ఉండేది ఇక్కడే. ఒకానొక సందర్భంలో ఇక్కడి ఇన్ స్పెక్టర్ నెలసరి ఆదాయం రూ. 10 లక్షలు పైబడే ఉండేది .. అలాంటి పోలీస్ స్టేషన్ కు ఇప్పుడు ఇన్ స్పెక్టర్ గా వెళ్లాలంటేనే పోలీసులు జంకుతున్నారు .. కారణం ఏదైనా కానీ, ఇక్కడ తప్ప ఎక్కడైనా ఇవ్వండి..అని కొందరు అంటుంటే , వివాదాలు ఉన్నా సరే ఇక్కడే కావాలి.. అని మరికొందరు పైరవీ చేసుకుంటున్నారు… నిత్య వివాదాల్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్.. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అంటేనే రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు అందరి చూపు ఇక్కడే ఉంటుంది. దీంతో సాధారణంగానే ఈ పోలీస్ స్టేషన్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్లకు అంతగా అచ్చు రావడం లేదు..పబ్బులు, స్పా, మసాజ్ సెంటర్ ల నుండి మామూళ్లు వసూలు చేస్తూ పట్టుబడుతున్నారు పలువురు పోలీసులు…ఇక్కడ గతంలో పని చేసిన పలువురు పోలీసుల పైనా చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి..కొంత మంది అడ్డంగా ఏసీబీ కి దొరుకుతుంటే, మరి కొంత మంది మాత్రం మాముళ్లు తీసుకుంటూ కూడా వేధింపులకు గురి చేస్తున్నారు..ఇంకొందరు రియల్ ఎస్టేట్ వివాదాల్లో తలదూర్చి సెటిల్ చేస్తున్నారు..గతం లో వ్యాపారవేత్త జయరాం హత్య కేసు సందర్భంలో అప్పటి ఇన్ స్పెక్టర్ పైన ఆరోపణలు రావటంతో విఐపి జోన్ లో ఉన్న ఇద్దరు ఇన్ స్పెక్టర్లను అప్పటి ఉన్నతాధికారులు అటాచ్ చేశారు. ఇదే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ పే సిపి కార్యాలయానికి అటాచ్ చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :