Sunday, 08 September 2024 06:42:31 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

భారతదేశంలోనే 2036 ఒలింపిక్ గేమ్స్.. ఐఓసీ సెషన్‌లో ప్రకటించిన ప్రధాని మోదీ..

Date : 16 October 2023 10:07 AM Views : 105

జై భీమ్ టీవీ - జాతియం / : PM Narendra Modi: ఒలంపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చాలా ఉత్సుకతతో ఉందని, 2036లో జరిగే క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడబోమని ప్రధాని అన్నారు. తమ ఇంట్లో ఒలింపిక్స్‌ను చూడాలన్నది భారత ప్రజల కల అని, ఐఓసీ సహకారంతో కోట్లాది మంది భారతీయుల ఈ కలను నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రీడల ద్వారా పతకాలు మాత్రమే కాకుండా మనసులు కూడా గెలుస్తామని మోదీ అన్నారు. Olympics 2036: భారతదేశం ప్రస్తుతం ODI క్రికెట్ అంటే ప్రపంచ కప్‌నకు ఆతిథ్యం ఇస్తోంది. అయితే, వీటి తర్వాత భారత్ దృష్టి క్రీడల మహాకుంభ్ అంటే ఒలింపిక్ క్రీడలపై నెలకొంది. 2036లో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం చెప్పుకొచ్చారు. ముంబైలోని వరల్డ్ సెంటర్‌లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో మోదీ ఈ విషయం చెప్పారు. భారత్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వలేదు. 2010లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఇది కాకుండా, భారతదేశం 1982లో న్యూఢిల్లీలో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఒలింపిక్ క్రీడలు. ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం గురించి నరేంద్ర మోడీ చాలాసార్లు మాట్లాడారు. కానీ, IOC సెషన్‌లో, మోడీ అధికారికంగా భారతదేశం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మహా శివుడికి ఇష్టమైన మారేడు పండు.. మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలుసా..? ఇలాంటి వ్యాధులన్నీ పరార్..! ‘ఏ అవకాశాన్ని వదిలిపెట్టను’ ఒలంపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చాలా ఉత్సుకతతో ఉందని, 2036లో జరిగే క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడబోమని ప్రధాని అన్నారు. తమ ఇంట్లో ఒలింపిక్స్‌ను చూడాలన్నది భారత ప్రజల కల అని, ఐఓసీ సహకారంతో కోట్లాది మంది భారతీయుల ఈ కలను నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రీడల ద్వారా పతకాలు మాత్రమే కాకుండా మనసులు కూడా గెలుస్తామని మోదీ అన్నారు. ఈ క్రీడలు ఛాంపియన్‌లను సృష్టించడమే కాకుండా శాంతిని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. యూత్ ఒలింపిక్స్‌పైనా దృష్టి.. 2036లో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా 2029లో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు కూడా ఆతిథ్యం ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఐఓసీ నుంచి భారత్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ రెండోసారి ఐఓసీ సెషన్‌ను నిర్వహిస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :