Sunday, 08 September 2024 06:12:04 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

మాన్యశ్రీ కాన్షిరాం గారికీ భారతరత్న ఇవ్వాలి

బరిగెల శివ జై భీమ్ సంస్థల ఫౌండర్ చైర్మన్

Date : 15 March 2023 12:38 AM Views : 235

జై భీమ్ టీవీ - మహనీయుల చరిత్ర / : బహుజన సమాజ్ పార్టీ నిర్మాత కాన్షీరామ్ అని జై భీమ్ సంస్థల ఫౌండర్ చైర్మన్ బరిగెల శివ అన్నారు. రామదాసియా శిక్కు చమార్ కులస్తులైన తేల్‌సింగ్, బిషన్‌సింగ్ కౌర్ లకు .మార్చి 15,1934 పంజాబ్ రాష్ట్రంలో రోపార్ జిల్లా కావాస్‌పూర్ గ్రామంలోజన్మించాడు. జ్యోతిరావ్ ఫూలే, ఛత్రపతి సాహు మహరాజ్, పెరియార్ ఇవి రామస్వామి నాయకర్, నారాయణ గురు, అంబేద్కర్‌ ల ప్రబోధాలను రాజ్యాధికారం వైపు నడిపి విజయాలు సాధించాడు. తన 31వ ఏటనే అంబేద్కర్ రచించిన 'కుల నిర్మూలన ' గ్రంథం ద్వారా ప్రేరేపితుడయ్యాడు. తన తల్లికి ముప్ఫై పేజీల ఉత్తరం రాస్తూ 'ఇక నుంచి నేను కుటుంబ బాంధవ్యాలను తెంచుకుంటున్నాను. నా కోసం మీరు వెతకవద్దు' అంటూ బయటికి వెళ్లి, చనిపోయే వరకు తిరిగి ఇంటికి వెళ్లలేదు. 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించాడు. ఒక ఓటు - ఒక నోటు అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బుతోనే ప్రచారం చేశాడు. కులాన్ని నిర్మూలిద్దాం - బహుజన సమాజాన్ని నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడు. నువ్వు 85 శాతం ఉండగా 15 శాతం మీద ఎందుకు ఆధారపడతావు? నడువు పార్లమెంటు, అసెంబ్లీకి నడువు. నీ కాళ్లమీద నీవే నడువు అంటూ బహుజనులను ఉసిగొల్పాడు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి. ప్రజల భూమి మీద ప్రజలకు హక్కులేదా? అనేవాడు. కులాన్ని కులంతోనే జయించాలని కులాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకున్నాడు. యూపిలోని చమార్లనే పునాదిగా చేసుకొని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్, బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో ఇతర కులాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేశాడు. మాయావతిని ముఖ్యమంత్రిగా చేశాడు. 1984లో ప్రారంభమైన బిఎస్‌పి 1996నాటికి జాతీయ పార్టీగా ఎదిగింది. 2006 అక్టోబరు 9న కాన్షీరాం మరణించాడు. ఇలాంటి మహనీయ వ్యక్తికీ భారత రత్న ఇవ్వాలని జై భీమ్ సంస్థల ఫౌండర్ చైర్మన్ బరిగెలశివ ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు.

Shiva

Admin

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :