జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రెండో విడత రుణ మాఫీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతలో భాగంగా రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో 6వేల 98 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇక మంగళవారం (జులై 30) రెండో విడతలో భాగంగా లక్షన్నర వరకు రుణమాఫీ నిధులు విడుదల చేయనున్నారు. ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో.. 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రైతుల రుణమాఫీ కోసం మొత్తం 31 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కాగా మంగళవారం లక్షన్నర రుపాయల వరకు రుణాల మాఫీని అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది ఈనెల 19న మొదటి విడత రుణ మాపీ ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన పదకొండున్నర లక్షల ఖాతాల్లో రూ.6 వేల కోట్లు జమ చేయచేశారు. అయితే ఆధార్ నంబరు, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో సుమారు 17 వేల మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలను ఆగస్టు 15లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Admin