Saturday, 18 May 2024 09:42:16 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కేసీఆర్ అహంకారానికి సమాధి కట్టాలె : రేవంత్ రెడ్డి

Date : 06 January 2023 03:45 PM Views : 232

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : సీఎం కేసీఆర్ అహంకారానికి తెలంగాణ సమాజం సమాధి కట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై సీబీఐ, ఈడీకి సైతం ఫిర్యాదు చేస్తామని అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించారు. కేసీఆర్ పరిపాలనను పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. ఎమ్మెల్యేలను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి తన పార్టీలోకి చేర్చుకున్నడని విమర్శించారు. అ 2018లో బీఆర్ఎస్ కు మెజార్టీ ఉన్నా కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ ను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి వాపోయారు. కేసీఆర్ 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మందిని తమవైపు తిప్పుకొని విలీనం చేసుకుంటే తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా స్పీకర్ ఓకే చెప్పారని అన్నారు. అలా పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో సబితకు మంత్రి పదవి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డికి ఆర్థిక పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు పొందారని రేవంత్ ఆరోపించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :