Saturday, 18 May 2024 11:19:35 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అదే జోరు.. అదే స్పీడు.. రెట్టింపు ఉత్సాహంతో గులాబీ బాస్ స్పీచ్‌లు

Date : 30 October 2023 07:32 PM Views : 63

జై భీమ్ టీవీ - తెలంగాణ / : హ్యాట్రిక్‌ టార్గెట్‌గా ప్రచారపర్వంలో కారు టాప్‌గేరులో దూసుకెళ్లోంది. దసర తరువాత జోష్‌ మరింత పెరిగింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే అస్త్రాలుగా బీఆర్‌ఎస్‌ గెలుపు దరువేస్తోంది. రెండో విడత ప్రచారంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరింత జోరు పెంచారు. ఆదివారం కోదాడ. తుంగతుర్తి, ఆలేరు….గులాబీమయం కాగా.. సోమవారం జుక్కల్‌..బాన్స్‌వాడ.. నారాయణ ఖేడ్‌ లో బీఆర్‌ఎస్‌ ధూమ్‌ దామ్‌‌గా ప్రచార హోరు నడిపింది బీఆర్‌ఎస్. వాళ్లు వచ్చి.. వీళ్లు వచ్చి ఓట్లు అడిగితే అని ఆగం ఆగం కావొద్దు.. ఇవాళ ప్రతి ఇంటికి నీళ్లు ఎలా వచ్చినయ్‌.. కోతల్లేని కరెంట్ ఎవరి వల్ల… ఎందువల్ల ఇవాళ బంగారు తెలంగాణ..,, బుద్ధికి పనిపెట్టి ఓటేయాలంటూ హుషారెత్తారించారు సీఎం కేసీఆర్‌. గ్యారెంటీలు ఇస్తుండ్రని గాయ్‌ గాయ్‌ కావొద్దని కాంగ్రెస్‌ టార్గెట్‌గా మరోసారి పవర్‌ అస్త్ర ప్రయోగించారు కేసీఆర్‌. హామీలు ఫుల్‌..అమలు నిల్లు. కాంగ్రెస్‌ ఓటేస్తే కత కర్నాటకలా ఉంటదన్నారు. మహారాష్ర్ట పర్యటనలో అక్కడి రైతుల దైన్యం చూస్తే దు:ఖం కట్టలు తెగిందన్నారు కేసీఆర్‌. ఎప్పటి నుంచో పెద్ద రాష్ర్టంగా వున్న మహారాష్ట్ర ఎట్లుంది. తెలంగాణ ఎట్లుందని కళ్లకు కట్టారు కేసీఆర్‌. ఆదాయం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో సంక్షేమం లేదన్నారు. రైతు బంధు… ఈ పథకం గురించి ఎవరైనా ఆలోచించారా? రైతు బంధును సృష్టించిందే తానన్నారు కేసీఆర్‌. రైతు బంధుపై కొందరు కిరికిరి చేస్తున్నారని విమర్శించారు. బరాబార్‌ రైతు బంధు కొనసాగుతుందన్నారు కేసీఆర్‌. ధరణిపై కొందరు విషం కక్కుతున్నారన్నారు కేసీఆర్‌. ధరణి లేకపోతే మళ్లీ భూముల వ్యవహారం దళారుల చేతికి వెళ్తుందన్నారు. చుక్క నెత్తురు నేలరాలకుండా తెలంగాణ తెచ్చుకున్నాం. స్వపరిపాలనలో చక్కగా అభివృధ్ది, సంక్షేమం పెంచుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కొందరు హింసకు తెరలేపుతున్నారని ఆరోపించారు కేసీఆర్‌. దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్తా ప్రభాకర్‌ రెడ్డిపై దాడి ఓ పిరికి చర్య అన్నారు కేసీఆర్‌. ఈ ఘటనను యావత్‌ తెలంగాణ సమాజం ఖండించాలన్నారు. జుక్కల్‌, బాన్స్‌వాడ..నారాయణ్‌ ఖేడ్‌ మూడు సభలు కార్యకర్తలతో హోరుతో దద్దరిల్లాయి. తెలంగాణ ..రంగు రుచి వాసన లేని స్వచ్చమైన నీటిలాందిన్నారు కేసీఆర్‌. భాయ్‌-భాయ్‌ సంస్కృతికి తెలంగాణ వేదిక అన్నారు.కానీ కొందరు ఈ సహృదత్వాన్ని విచ్ఛినం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తన కంఠంలో ప్రాణం వున్నంత వరకు అలాంటి ఆటలు సాగినవ్వనన్నారు కేసీఆర్‌. మూడు సభలు..ఆరు సిక్సర్ల లెక్క ప్రజాశీర్వాద సభలతో బీఆర్‌ఎస్‌ జోష్‌గా దూసుకెళ్తోంది. ప్రతి సభలో పవర్‌ అస్త్ర ప్రయోగిస్తున్నారు గులాబీ దళపతి కేసీఆర్‌. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను బారీ మెజార్జీతో గెలిపించాలని పిలుపునిచ్చారాయన. బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి- సంక్షమం సాధ్యమన్నారు కేసీఆర్‌.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :