Saturday, 18 May 2024 10:28:21 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

జూనియర్ కార్యదర్శులకు కేసీఆర్ వార్నింగ్ విధుల్లో చేరకుంటే.. ఉద్యోగం పీకేస్తా

Date : 08 May 2023 05:54 PM Views : 161

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు జూనియర్ పంచాయితీ కార్యదర్శకులకు నోటీసులు జారీ చేసింది. మే 09వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు.. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్‌‌)లు ఏప్రిల్ 28 నుంచి సమ్మె చేస్తున్నారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఏప్రిల్ 13 తేదీన ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత 15 రోజుల నోటీసు పీరియడ్ ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఏప్రిల్ 28వ తేదీ నుంచి జూనియర్ పంచాయితీ కార్యదర్శులు నిరవధిక సమ్మెకు దిగారు. గత 11 రోజులుగా జూనియర్ పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నా..ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టినా..ఎలాంటి స్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జేపీఎస్ ల ప్రొబెషనరీ గడువు ఏప్రిల్ 11 2023తో పూర్తయింది. అయినప్పటికీ ప్రభుత్వం రెగ్యులరైజేషన్‌ గురించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ కారణంగానే జూనియర్ పంచాయితీ సెక్రటరీలు సమ్మెబాట పట్టారు. 2019 ఏప్రిల్‌ 12న విధుల్లో చేరిన జేపీఎస్ లను మూడేళ్ల ప్రొబెషనరీ కాలం తర్వాత రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత మరో ఏడాది ప్రొబెషనరీ కాలాన్ని పెంచింది. మొత్తం నాలుగేళ్లు ప్రొబేషనరీ కాలం ముగిసినా.. ప్రభుత్వం జూనియర్ పంచాయితీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్‌ చేయడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ప్రతి కార్యదర్శి క్రియాశీలంగా పనిశారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శుల డిమాండ్లు.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ 6.0. విడుదల చేయాలి. గడిచిన 4 సంవత్సరాల ప్రొబెషనరీ కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలి. ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను అందరినీ JPS లు గా ప్రమోట్ చేస్తూ పని చేసిన కాలాన్ని ప్రొబెషనరీ పిరియడ్లో భాగంగా పరిగణించాలి. వారిని కూడా రెగ్యూలర్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ ను నిర్ధారించి ప్రకటించాలి మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియమాకాలు చేపట్టి ఆదుకో వాలి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :