Friday, 04 October 2024 04:39:38 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

తెలంగాణ సచివాలయం ప్రారంభం.. ఏమంత్రికి ఎక్కడంటే..?

Date : 30 April 2023 04:46 PM Views : 170

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభమైంది. నూతన ఫైళ్లపై సంతకాలు చేసిన అనంతరం మంత్రులకు ఛాంబర్​ లు కేటాయించారు. మంత్రి హరీష్​ రావు తన ఛాంబర్​ లో ప్రత్యేక పూజలు చేసి ఫైలుపై సంతకం చేశారు. అంతకు ముందు హరీష్​ రావు సీఎం కేసీఆర్​ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే పలువురు మంత్రులు వారికి కేటాయించిన ఛాంబర్​ లలో ఆశీసులైనారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సీఎస్​) శాంత కుమారి కూడా తన ఛాంబర్​ లో ఆశీనులైనారు. తెలంగాణ ఆత్మగౌరవ దీపిక, అస్తిత్వ వైభవానికి అద్భుతమైన ప్రతీక.. కొత్త సచివాలయ భవనం అట్టహాసంగా ప్రారంభమైంది. కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు ఒకేసారి తమ సీట్లలో ఆసీనులయ్యారు. కాకతీయ శైలి, హిందూ, దక్కనీ శైలుల మేళవింపుతో రూపుద్దిద్దుకుని కేక పుట్టించేలా ఉన్న ఈ సచివాలయంలో ఏ ఫోర్‌లో ఏ శాఖా మంత్రులు ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్లోర్ల వారీగా మంత్రులు.. గ్రౌండ్‌ ఫ్లోర్‌: కొప్పుల ఈశ్వర్‌ (A వింగ్‌), మల్లారెడ్డి (B వింగ్‌) ఫస్ట్ ఫ్లోర్‌: మహమూద్‌ అలీ (A వింగ్‌), సబితా ఇంద్రారెడ్డి (B వింగ్‌), ఎర్రబెల్లి (D వింగ్‌) సెకండ్ ఫ్లోర్‌: హరీష్‌రావు (A వింగ్‌), జగదీష్‌ రెడ్డి (B వింగ్‌), తలసాని శ్రీనివాస్‌ (D వింగ్‌) థర్డ్ ఫ్లోర్‌: కేటీఆర్‌ (A వింగ్‌), సత్యవతి రాథోడ్‌ (B వింగ్‌), నిరంజన్ రెడ్డి (D వింగ్‌) ఫోర్త్ ఫ్లోర్‌: ఇంద్రకరణ్ రెడ్డి (A వింగ్‌), శ్రీనివాస్‌ గౌడ్‌ (B వింగ్‌), గంగుల కమలాకర్ (D వింగ్‌) ఫిఫ్త్ ఫ్లోర్: ప్రశాంత్ రెడ్డి (A వింగ్‌), పువ్వాడ అజయ్‌ (D వింగ్‌) సిక్స్త్ ఫ్లోర్‌: సీఎం కేసీఆర్‌, సీఎంఓ అంతస్తుల వారీగా శాఖల వివరాలు.. గ్రౌండ్‌ ఫ్లోర్‌: ఎస్సీ సంక్షేమ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, రెవెన్యూ, కార్మిక, ఉపాధి కల్పన శాఖలు మొదటి అంతస్తు: హోం, గ్రామీణాభివృద్ది, విద్యా, పంచాయతీరాజ్‌ శాఖలు 2వ అంతస్తు: వైద్యారోగ్యం, విద్యుత్‌, సెకండ్ ఫ్లోర్‌, పశు సంవర్ధక, ఆర్థిక శాఖలు 3వ అంతస్తు: మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, పురపాలక, పట్టణాభివృద్ది, ప్లానింగ్‌, ఐటీ, వ్యవసాయ, సహకార, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు 4వ అంతస్తు: పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, బీసీ సంక్షేమ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, నీటి పారుదల, న్యాయశాఖలు. 5వ అంతస్తు: రవాణా, రహదారులు, సాధారణ పరిపాలన, భవనాల శాఖలు. 6వ అంతస్తు: సీఎం కార్యాలయం, సీఎం పేషీ, కార్యదర్శులు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :