Saturday, 18 May 2024 11:57:35 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

హైదరాబాద్‌ టూ షిర్డీ టూర్‌.. ఫ్లైట్‌లో ప్రయాణం. ధరెంతో తెలుసా.?

Date : 19 November 2023 08:39 AM Views : 103

జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్‌ నుంచి షిర్డీ టూర్‌ వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. తక్కువ ఖర్చులో ఎంచక్కా ఫ్లైట్‌లో షిర్డీ వెళ్లే అవకాశం పొందొచ్చు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ అవకాశాన్ని కల్పించింది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇప్పటికే షిర్డీకి ఏసీ బస్సు సర్వీసును అందిస్తోండగా దానికి అదనంగా విమాన సేవలను అందిస్తోంది. దీంతో ఎలాంటి రిస్క్‌ లేకుండా ప్రయాణికులు షిర్డీ టూర్‌ వెళ్లొచ్చు. ఇంతకి ఈ టూర్‌లో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్రయాణం ఎలా సాగుతుంది.? ప్యాకేజీ వివరాలు మీకోసం. ఈ టూర్‌ ప్యాకేజీ ధరను రూ. 12,499గా నిర్ణయించారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అందిస్తున్న ఈ టూర్‌ ప్యాకేజీలో భాగంగా.. హైదరాబాద్‌లో విమానాశ్రాయానికి చేర్చట మొదలు, హోటల్‌, భోజనం, వసతి ఈ ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. షిర్డీలో స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లటం కూడా తమ బాధ్యతేనని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్లైట్ జర్నీ ప్రారంభమవుతుంది. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు షిర్డీ చేసుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం 4.30 గంటలకు షిర్డీ సాయి దర్శనం ఉంటుంది. సాయంత్రం హారతి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. తర్వాత రాత్రి 7 గంటలకు బాబా థీమ్‌ పార్క్‌లో సౌండ్‌ అండ్‌ లైట్ షోను చూడొచ్చు. రాత్రి హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది. అనంతరం రెండో రోజు ఉదయం టిఫిన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 8 గంటలకు పంచముఖి గణపతి మందిర దర్శనం ఉంటుంది. అనంతరం పాత షిర్డీ, ఖండోబా మందిర్‌, సాయి తీర్థం వంటి ప్రదేశాలను సందర్శించాల్సి ఉంటుంది. తర్వాత భోజనం చేయగానే.. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు విమానం బయలుదేరి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుంటారు. భోజనం, హోటల్‌లో బస వంటివి ఈ ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. అయితే కొన్ని దర్శన టికెట్లు మాత్రం స్వయంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :