Saturday, 18 May 2024 09:42:08 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

టికెట్ల రేసులో పైచేయి సాధించిన బ్రదర్స్.. పార్టీపై పట్టు సాధించారా..? జిల్లాకు పూర్వ వైభవం వచ్చేనా?

Date : 18 November 2023 12:49 PM Views : 105

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉన్న జిల్లా కేసీఆర్ హవాతో చేజారిపోయింది. ఇంతకాలం జిల్లాలో తిరుగులేదనిపించుకున్న బ్రదర్స్‌.. ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోయిన చోట తిరిగి దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ల రేసులో పైచేయి సాధించిన బ్రదర్స్.. పార్టీపై మెల్లమెల్లగా పట్టు సారిస్తున్నారు. పూర్వ బ్రాండ్ ఇమేజ్ కోసం ఆ బ్రదర్స్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ ఎన్నికలు బ్రాండ్ ఇమేజ్‌కు ప్రతిష్టాత్మకంగా ఎందుకు మారాయి..? ఏ జిల్లా..? ఎవరా బ్రదర్స్..? అంటే ఈస్టోరీ చదవాల్సిందే..! తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హేమా హేమీలు ఉన్నా, వారి రూటే సపరేటు. వారే ఉమ్మడి న‌ల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిత్యం ఏదో ఒక హాట్ కామెంట్స్‌తో కోమటిరెడ్డి బ్రదర్స్ వార్తల్లో నిలుస్తుంటారు. ఒకే మాట‌గా.. ఒకే బాట‌గా.. న‌డిచే నేత‌లుగా ప్రజ‌ల్లో త‌మకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది వీరిద్దరే. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఇమేజ్. నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా ఉండేది. జిల్లా కాంగ్రెస్‌లో ఆ బ్రదర్స్ ఏం చెబితే, అదే వేదంగా మారేది. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో హేమ హేమీలైన.. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఉద్ధండ నేతలు ఉన్నా.. కోమటిరెడ్డి బ్రదర్స్ దే హావా. వీరి హావాకు తగ్గట్టుగానే వర్గ పోరులో కూడా ఈ బ్రదర్స్‌దే పైచేయి. ఎన్నో ఏళ్లుగా ఈ ఇద్దరు అన్నదమ్ములు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్.. యువ నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయ్యారు. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాలతోపాటు ఇబ్రహీంపట్నం, జనగామ నియోజక వర్గాల్లో బలమైన కేడర్ ఉంది. ఇక్కడ అభ్యర్థి ఎవరైనా గెలుపోటములను శాంచించే సత్తా వీళ్లకుంది. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 16 నెలల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరదడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒంటరి వాడయ్యాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలతో కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఇమేజ్ మసక బారిందని పార్టీలో చర్చ జరిగింది. కానీ ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ టికెట్ తో మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో బ్రదర్స్ హవా మళ్లీ మొదలైంది. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో కూడా బ్రదర్స్ పైచేయి సాధించారు. నల్లగొండ, మునుగోడులలో బ్రదర్స్ పోటీ చేస్తూ, తమ వర్గానికి చెందిన బీర్ల ఐలయ్యకు ఆలేరు, మందుల సామేల్ కు తుంగతుర్తి, వేముల వీరేశంకు నకిరేకల్, బీఎల్ఆర్‌కు మిర్యాలగూడలో టికెట్లు ఇప్పించుకుని పంతం నెగ్గించుకున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరిగింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే కోమటిరెడ్డి బ్రదర్స్ పూర్వ బ్రాండ్ ఇమేజ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పాలని పట్టుదలగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తమ స్థానాల్లో తాము గెలవడంతోపాటు తమ వర్గానికి చెందిన అనుచరులను గెలిపించుకునే బాధ్యత బ్రదర్స్ భుజ స్కందాలపై వేసుకున్నారు. ముఖ్యంగా నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ లలో తమ పట్టు కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక్కడి నుంచి మరోసారి గెలిచి తన పట్టు నిరూపించుకోవాలని కోమటిరెడ్డి కసిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన వెంకట్ రెడ్డిని ఈసారి ఎలాగైనా ఓడించాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి గెలిచి తన సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. తమకు పట్టున్న మరో నియోజకవర్గం నకిరేకల్‌లో గత ఎన్నికల్లో అనుచరుడు చిరుమర్తి లింగయ్యను గెలిపించుకున్నారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య రాజకీయ గురువులను కాదని బీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ దూకుడుకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ కూడా ప్లాన్ చేస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బుతో మెడిసిపడుతున్నారని చిట్యాల రోడ్డు షో లో మంత్రి కేటీ రామారావు విమర్శల దాడి చేశారు. నల్లగొండ మునుగోడులలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమి ఖాయమని కేటీఆర్ అన్నారు. ఈ మూడు నియోజక వర్గాల్లో విజయం సాధించడంతోపాటు అనుచరులు పోటీ చేస్తున్న ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేసేందుకు బ్రదర్స్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమ వర్గానికి చెందిన వారికి కాంగ్రెస్ టికెట్లు ఇప్పించుకొని టికెట్ల రేసులో ప చేయి సాధించారు. తమతోపాటు అనుచరులను కూడా గెలిపించుకొని పార్టీపై పట్టు సాధించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ భావిస్తున్నారు. సీఎం రేసులో తాను కూడా ఉన్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుసార్లు చెప్పకనే చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ వర్గంతో కీలకంగా వ్యవహరించాలని బ్రదర్స్ భావిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో పార్టీ మారిన చిరుమర్తి లింగయ్యను ఓడించాలని బ్రదర్స్ నకిరేకల్ లో ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పది స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని కోమటిరెడ్డి బ్రదర్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికలు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఓటర్లు బ్రదర్స్ బ్రాండ్ ‌ఇమేజ్‌ను పెంచుతారో లేదో చూడాలి..!

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :