Saturday, 14 September 2024 03:05:19 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

తెలంగాణకు ప్రియాంక, రాహుల్.. షెడ్యూల్ ఇదే

Date : 31 October 2023 08:46 AM Views : 103

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకతో కలిసి గత నెల 18న ములుగు జిల్లా బహిరంగ సభలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రాహుల్ అక్టోబర్ 19, 20న ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాలో పర్యటించారు. లేటెస్ట్‌గా మహిళా ఓటర్లపై ఫోకస్ పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మంగళవారం ప్రియాంక గాంధీ పర్యటించబోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు దేవరకద్రకు చేరుకుని తిమ్మాయిపల్లి తండాకు చెందిన మహిళలతో సమావేశం అవుతారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లపై ప్రచారం చేస్తారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కొల్లాపూర్ నియోజవర్గ కేంద్రంలో నిర్వహించే పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక నవంబర్ 1, 2న రాహుల్‌గాంధీ మరోసారి బస్సుయాత్ర, రోడ్‌ షోలలో పాల్గొంటారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ తొలివిడత యాత్రకు మంచి స్పందన వచ్చిందని.. ఈ యాత్రను కూడా విజయవంతం అవుతుందని లెక్కలేసుకుంటున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌ ఘడ్, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎంలతోనూ రాష్ట్రంలో ప్రచారం చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు. సభలు, రోడ్‌ షోలకు రూట్‌ మ్యాప్‌ సిద్ధంచేస్తున్నారు. వచ్చేనెల 3 నుంచి నామినేషన్లు మొదలవుతాయి. నామినేషన్ల అనంతరం ప్రచారం స్పీడ్ మరింత పెంచుతామంటున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :