Saturday, 14 September 2024 03:08:07 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

కాసేపట్లో నల్గొండకు సీఎం కేసీఆర్

Date : 28 November 2022 09:14 AM Views : 244

జై భీమ్ టీవీ - తెలంగాణ / : సీఎం కేసీఆర్ కాసేపట్లో నల్గొండ జిల్లాకు వెళ్లనున్నారు. దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్లకు చేరుకోనున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని మంత్రి జగదీష్ రెడ్డి సహా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం అక్కడే సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి ప్రగతిభవన్ చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. 5 ప్లాంట్ల నిర్మాణం మొత్తం రూ.‎29,992 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ విద్యుత్​ ఉత్పత్తి కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యంతో మొత్తం 5 ప్లాంట్లు నిర్మిస్తున్నారు. మొదటి ప్లాంటులో విద్యుదుత్పత్తిని 2023 సెప్టెంబరుకల్లా ప్రారంభిస్తామని జెన్‌కో వెల్లడించింది. అదే ఏడాది డిసెంబరుకల్లా రెండో ప్లాంటు, 2024లో 3, 4 ప్లాంట్లలో విద్యుదుత్పత్తిని ప్రారంభించి రాష్ట్రానికి కరెంటు సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. ఈ మహా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో ఇప్పటికే 61.5 శాతం పనులు పూర్తయ్యాయి. 2023 డిసెంబరు నాటికల్లా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉండగా... ఈ లోగా యాదాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభించాలని జెన్‌కోకు సీఎం సూచించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :