Saturday, 18 May 2024 11:37:55 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. దళితబంధు కమిషన్​లో కేసీఆర్కు వాటా

Date : 30 April 2023 04:48 PM Views : 115

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : మన్​కీబాత్​ కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ ప్రజలతో మమేకమవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారి సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. మన్​ కీబాత్​ కార్యక్రమం వంద ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు అన్ని సమస్యలపై ప్రధాని మాట్లాడారని పేర్కొన్నారు. మన్​కీ బాత్​ రాజకీయం కోసం కాదని స్పష్టం చేశారు. ప్రజలను, విద్యార్థులను, వారి తల్లి దండ్రులను చైతన్యం చేయడం కోసమే ఈ కార్యక్రమని తెలిపారు. హరి ప్రసాద్, చింతల వెంకట్ రెడ్డి, అహ్మద్ పాషానీ తదితర స్ఫూర్తివంతమైన వ్యక్తులను దేశానికి మోడీ పరిచయం చేశారన్నారు. మోడీకి పూర్తి భిన్నంగా కేసీఆర్ సీఎం కేసీఆర్ పని మాత్రం ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తి భిన్నంగా ఉందని అన్నారు. కేసీఆర్​కి తినడం, తాగడం, పడుకోవడం ఇవే తప్ప ప్రజల సమస్యలపై ఆయనకు పట్టింపు లేదని విమర్శించారు. వర్షాల వల్ల చిన్నారి చనిపోతే కనీసం పట్టించుకోవట్లేదని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా డూమ్​లు తీసేసే పరిపాలన.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బండి సంజయ్​ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఆ తరువాత సీఎం ఎవరైనా ఆ డూమ్​లు కూల్చే వరకు సచివాలయంలో అడుగు పెట్టనని పేర్కొన్నారు. అది తనకు సచివాలయం లాగా కనబడట్లేదని చెప్పారు. దళితబంధు కమిషన్​లో కేసీఆర్​కు వాటా.. దళితబంధు నిధుల్ని భారాస ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారని స్వయాన సీఎంనే ఒప్పుకున్నారని బండి గుర్తు చేశారు. ఈ నిధుల్లో కేసీఆర్​కి కూడా వాటి ఉందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని తీవ్ర విమర్శలు చేశారు. మంత్రులను సైతం ముఖ్యమంత్రి కలవడని అన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :