Saturday, 18 May 2024 01:00:07 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

షర్మిల కారులో ఉండగానే టోయింగ్ వెహికిల్తో లాక్కెళ్లిన పోలీసులు

షర్మిల కారులో ఉండగానే టోయింగ్ వెహికిల్తో లాక్కెళ్లిన పోలీసులు

Date : 29 November 2022 02:05 PM Views : 204

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ప్రగతి భవన్ ముట్టడించేందుకు సోమాజిగూడ వెళ్లిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న దాడిలో ధ్వంసమైన కారులోనే ఆమె సోమాజిగూడకు వెళ్లారు. టీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేసిన బస్సును కూడా ప్రగతి భవన్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు షర్మిల కారుకు అడ్డంగా తమ వాహనాలను నిలిపారు. షర్మిలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో ఆమె కారు అద్దాలు మూసివేసి కారులోనే బైఠాయించారు. ముందుకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.షర్మిల పోలీసుల మధ్య వాగ్వాదంతో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. అయినా ఆమె కారు నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ట్రాఫిక్ జాం, శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపిన పోలీసులు టోయింగ్ వెహికిల్ రప్పించి షర్మిల కారులో ఉండగానే దాన్ని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద కూడా షర్మిల కారు నుంచి దిగేందుకు నిరాకరించారు. అందులో కూర్చొనే నిరసన తెలుపుతున్నారు. అయితే ఓ పార్టీ అధ్యక్షురాలు కారులో ఉండగానే దాన్ని టోయింగ్ వెహికిల్ తో లాక్కెళ్లిన పోలీసులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అంతకు ముందు లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం వద్ద హైడ్రామా జరిగింది. ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో షర్మిల బయటకు రాకుండా ఆమె ఇంటి బయట భారీగా పోలీసులు మోహరించారు. ఆమెను హౌస్ అరెస్ట్ చేసేందుకు సిద్ధమ్యయారు. అయితే పోలీసుల కళ్లుగప్పిన షర్మిల వారికి తెలియకుండా సోమాజిగూడకు చేరుకున్నారు.సోమవారం వైఎస్సార్టీపీ చీఫ్​ షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్​ కార్యకర్తలు దాడికి దిగారు. ఆమె ప్రయాణించే బస్సుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కాన్వాయ్‍లోని వాహనాలపై రాళ్లదాడికి దిగారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కూడా నిప్పుపెట్టారు. పాదయాత్ర కోసం ఊరురా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలను ఎక్కడికక్కడ తగలబెట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీసులు షర్మిల యాత్రకు అనుమతి నిరాకరించారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీస్​ వాహనంలో హైదరాబాద్ తరలించారు. దీంతో ఆదివారం 3,500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న షర్మిల పాదయాత్రకు వరంగల్​ జిల్లా నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తండా వద్ద బ్రేక్ పడింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :