Saturday, 18 May 2024 10:51:48 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

17 రోజుల్లో 41 బహిరంగసభలు.. కారు గేర్‌ మార్చిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌..

Date : 11 October 2023 11:40 AM Views : 67

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఈ నెల 15 నుంచి నవంబరు 9 వరకూ 17 రోజుల్లో 41 బహిరంగసభల్లో పాల్గొనాలని నిర్ణయించారు కేసీఆర్‌. నామినేషన్లు ప్రారంభమయ్యే నవంబరు 3 తేదీలోపే కేసీఆర్‌ 26 బహిరంగసభల్లో పాల్గొననున్నారు. ప్రత్యర్థి పార్టీలు ప్రచార రంగంలోకి దిగేలోపే.. సుడిగాలి పర్యటనలతో క్షేత్రాన్ని వేడెక్కించాలన్నది బీఆర్‌ఎస్‌ వ్యూహంగా తెలుస్తోంది. ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫాంలు అందజేయనున్న కేసీఆర్‌.. అదేరోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగే బహిరంగసభ నుంచి ఎన్నికల శంఖం పూరించనున్నారు. హైదరాబాద్, అక్టోబర్ 11: అందరి కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించి అసెంబ్లీ ఎన్నికలకు రేస్‌ స్టార్ట్‌ చేసిన కె. చంద్రశేఖర్ రావు.. ఇప్పుడు గేర్‌మార్చాలని డిసైడ్‌ అయ్యారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తుండగా..అధినేత కేసీఆర్‌ సైతం ఇక రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 15 నుంచి నవంబరు 9 వరకూ 17 రోజుల్లో 41 బహిరంగసభల్లో పాల్గొనాలని నిర్ణయించారు కేసీఆర్‌. నామినేషన్లు ప్రారంభమయ్యే నవంబరు 3 తేదీలోపే కేసీఆర్‌ 26 బహిరంగసభల్లో పాల్గొననున్నారు. ప్రత్యర్థి పార్టీలు ప్రచార రంగంలోకి దిగేలోపే.. సుడిగాలి పర్యటనలతో క్షేత్రాన్ని వేడెక్కించాలన్నది బీఆర్‌ఎస్‌ వ్యూహంగా తెలుస్తోంది. ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫాంలు అందజేయనున్న కేసీఆర్‌.. అదేరోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగే బహిరంగసభ నుంచి ఎన్నికల శంఖం పూరించనున్నారు. తెలంగాణ ఎన్నిక తేదీల ప్రకటన వచ్చిన తర్వాత జరిగే తొలి బహిరంగ సభ కావడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికను రెడీ చేసింది. పండుగల సమయంలో.. అయితే, ప్రచార పర్వానికి పండుగల సమయంలో కొద్దిగా బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా దసరా, బతుకమ్మ పండుగల సమయంలో .. అంటే ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రచారంతో దూసుకుపోవాలని కారు పార్టీ షెడ్యూల్ ఫిక్స్ చేసింది. ఇదిలావుంటే, తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే ఉమ్మడి ఖమ్మం సహా కొన్ని జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అభ్యర్థులను నిర్ణయించి.. ప్రకటించిన తర్వాత మంత్రులు కేటీఆర్, హరీష్ రావు 50కి పైగా నియోజకవర్గాల్లో పర్యటించి.. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు.. పార్టీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. దాదాపు తెలంగాణలో అన్ని నియోజకవర్గాలను రెండు, మూడుసార్లు చుట్టేలా బీఆర్ఎస్ ముఖ్యనాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పెండింగులో పెట్టిన నాలుగు సీట్లలో మొత్తం 119 స్థానాలకు గాను 115 చోట్ల అభ్యర్థులను ఆగస్టులోనే ప్రకటించారు అధినేత కేసీఆర్‌. బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో కలిపి 104 మంది ఎమ్మెల్యేలుండగా.. వారిలో ఏడుగురికి మినహా మిగిలిన వారందరికీ మళ్లీ టికెట్లు కేటాయించారు. పెండింగులో పెట్టిన నాలుగు సీట్లలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలున్న జనగామ, నర్సాపూర్‌ స్థానాలున్నాయి. పలు దఫాల చర్చలు జరిపిన తర్వాత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆర్టీసీ ఛైర్మన్‌గా ప్రకటించింది. అక్కడ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇక నర్సాపూర్‌లో కూడా సునీతా లక్ష్మారెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చి అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆ రెండు నియోజకవర్గాలైన గోషామహల్‌, నాంపల్లి అభ్యర్థులకు కూడా ఈ నెల 15న బీఫాంలు అందజేసే ఛాన్స్ ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను గుర్తించిన అధిష్టానం..అక్కడ అభ్యర్ధిపై మార్పుపై కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :