Saturday, 18 May 2024 09:42:19 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

వ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలకు బెయిల్​

Date : 29 November 2022 10:48 PM Views : 182

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిలకు ఊరట దక్కింది. కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. షర్మిలతోపాటు మరో ఐదుగురికి బెయిల్​ మంజూరు చేసింది న్యాయస్థానం.సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో పాటు డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసులు పెట్టారు SR నగర్ పోలీసులు. షర్మిల పాటు YSRTP చెందిన మరో ఐదుగురి పై కేసులు నమోదు చేశారు. షర్మిలకు బెయిల్​ మంజూరు కావడంతో విజయమ్మ దీక్షను విరమించారు. దీంతో లోటస్​ పాండ్​ లో వైఎస్సార్టీపీ కార్యకర్తలు కేరింతలు, నినాదాలు చేస్తున్నారు. షర్మిల అరెస్టుతో రోజంతా హైదరాబాద్ లో హై టెన్షన్ క్రియేట్ అయ్యింది. TRS దాడులకు నిరసనగా CM క్యాంపు ఆఫీసు ముట్టడికి యత్నించిన షర్మిలను అదుపులోకి తీసుకొని SR నగర్ PSకు తరలించారు. అక్కడే కార్యకర్తల ఆందోళనలు, పోలీసుల లాఠీ ఛార్జ్ తో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి షర్మిలను భారీ బందోబస్తు మధ్య నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు లోటస్ పాండ్ లో దీక్ష చేశారు విజయమ్మ. YSRTP చీఫ్ షర్మిల సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. నర్సంపేటలో జరిగిన పాదయాత్రలో TRS దాడికి నిరసనగా CM క్యాంపు ఆఫీసు ముట్టడికి YSRTP పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 12:30 గంటలకు లోటస్ పాండ్ నుంచి CM క్యాంప్ ఆఫీసుకు బయలుదేరారు షర్మిల. 12:50కి షర్మిలను సోమాజీగూడ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. షర్మిలను అదుపులోకి తీసుకునే యత్నం చేయడంతో... షర్మిల తన కారు అద్ధాలు మూసేసి కారులోనే బైఠాయించారు. ముందుకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. షర్మిల-పోలీసుల వాగ్వాదంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో షర్మిల కారును టోయింగ్ వెహికల్ తో అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు SR నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. షర్మిలను SR నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో అక్కడ కూడా హైటెన్షన్ ఏర్పడింది. స్టేషన్ దగ్గరకు YSRTP కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. షర్మిల అరెస్ట్ ను నిరసిస్తూ కొంతమంది కార్యకర్తలు బిల్డింగ్ ఎక్కి నిరసన తెలిపారు. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే టైంలో పలువురిపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు-కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాట, వాగ్వాదం జరిగింది. SR నగర్ పోలీస్ స్టేషన్ లోనే షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అమీర్ పేట్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి భారీ బందోబస్తుతో నాంపల్లి కోర్టుకు తీసుకెల్లారు. షర్మిలతో పాటు మిగిలిన నిందితుల్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. షర్మిలను కోర్టుకు తరలించే టైంలో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న షాపుల్ని బలవంతంగా క్లోజ్ చేయించారు పోలీసులు. పోలీసుల తీరుపై షాపుల యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. YS షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ట్రాఫిక్ కి అంతరాయం కలిగించారంటూ 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. IPC 353, 333, 321 సెక్షన్ల కింద కేసు షర్మిలపై కేసు నమోదు చేశారు. షర్మిలతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు.లోటస్ పాండ్ లో దీక్ష కంటిన్యూ చేస్తున్నారు YS విజయమ్మ. SRనగర్ లో ఉన్న షర్మిలను చూడ్డానికి వెళ్తున్న విజయమ్మను పోలీసులు అడ్డుకోవడంతో సాయంత్రం నుంచి దీక్ష చేస్తున్నారు. షర్మిల దగ్గరకు పంపే దాకా దీక్షలోనే ఉంటానని చెప్పారు. పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా అని ప్రశ్నించారు YS విజయమ్మ. తన కూతురికి తోడుగా ఉండేందుకు వెళ్తానన్నా..పోలీసులు ఒప్పుకోవడం లేదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా అని ఫైర్ అయ్యారు. YS షర్మిల పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. CM కేసీఆర్ పై, రాజకీయ, మతపరమైన అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు సూచించింది. YS షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు షర్మిల తరఫు లాయర్. దీంతో వాదనలు విన్న కోర్టు.. వెంటనే షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు దేశాలు జారీ చేసింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :