జై భీమ్ టీవీ - తెలంగాణ / : కరువుతో ఉన్న భువనగిరిలో ఇవాళ అద్భుతమైన పంటలు పండిస్తున్నారు. ఈ జిల్లాకు యాదాద్రి భువనగిరి అని లక్ష్మీ నరసింహస్వామి పేరు పెట్టుకున్నాం. ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైన జిల్లా అద్భుతంగా అభివృద్ధి జరిగిందన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ, భువనగిరి జిల్లా కేంద్రాల్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. భువనగిరి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అద్భుతమైన అభివృద్ధి చేశారని గుర్తు చేశారు సీఎం. మళ్ళీ గెల్చేది శేఖర్ రెడ్డినేనని స్పష్టం చేశారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగంగా నిర్మిస్తున్న బస్వపూర్ రిజర్వాయర్ ద్వారా త్వరలోనే నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ధరణి ద్వారా రైతుల కష్టాలు పోయాయన్నారు సీఎం. అన్నదాతలు సంతోషంగా వ్యవసాయము చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు చేస్తాం అంటున్నారు.. ధరణి పోతే మళ్ళీ అన్నదాతలు కొట్లాటలు వస్తాయన్నారు. అవినీతి వస్తది.. ఫైరవీకారుల కాంగ్రెస్ పార్టీని రానివ్వొద్దని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. .కాంగ్రెస్ తో పెద్ద ప్రమాదం పొంచి ఉంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు కేసీఆర్. ప్రచారం పేరుతో ఎన్నికలప్పడు మాత్రమే వచ్చే నేతలను నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే కరంట్ మాయం అవుతుందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 3 గంటలు కరంట్ ఇస్తాం అంటున్న కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. భువనగిరిలో త్వరలోనే ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్.. నా కున్న సర్వే ప్రకారం 50 వేల మెజార్టీతో భువనగిరి లో గెలుస్తున్నామన్నారు కేసీఆర్. పొన్నాల అనే నాయకుడు తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించాలని కోరారు సీఎం. బీఆర్ఎస్ పార్టీకి కులం మతం అనే తారతమ్య భేదాలు లేవు. అందరి బాగు కోసం మేనిఫెస్టో విడుదల చేసామని తెలిపారు ముఖ్యమంత్రి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. యాదాద్రి లో భూముల రేట్లు అమాంతం పెరిగాయి.. అందరికి సన్న బియ్యం అందిస్తామని…అన్నదాతలకు 24 గంటల కరంట్ వుండాలంటే బీఆర్ఎస్ మాత్రమే గెలవాలన్నారు.
Admin