Saturday, 18 May 2024 01:42:01 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

లోకేష్ బాధను అర్థం చేసుకోగలను.. చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ స్పందన..

Date : 14 October 2023 12:24 PM Views : 72

జై భీమ్ టీవీ - తెలంగాణ / : చంద్రబాబు అరెస్టుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. లోకేష్‌ బాధను తానూ అర్థం చేసుకోగలనన్నారు. కేసీఆర్‌ నిరాహారదీక్ష టైమ్‌లో తానూ అదే బాధను అనుభవించానన్నారు. మీడియాతో మాట్లాడిన చిట్‌చాట్‌లో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భద్రతపై నారా లోకేష్ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలనన్నారు. నారా లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి భాదకరమన్నారు కేటీఆర్‌. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకు తెలియదని, కానీ చంద్రబాబు భద్రతకు ప్రమాదం అయితే రాజకీయల్లో ఇది దురదృష్టకరమైన విషయమన్నారు. లోకేష్ పరిస్ధితిని అర్ధం చేసుకోగలనని..రాజకీయలు వేరైనా ఆయన కుటుంబం భాదను తాను అర్థం చేస్కోగలనన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లో ఆందోళనలు వద్దని చెప్పాం: కేటీఆర్‌ నిమ్స్ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యం పై తాము కూడా చాలా ఆందోళన చెందామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ అధికారులు తమను తీవ్ర స్థాయిలో హెచ్చరించారన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి మానసిక స్ధితి ఉంటుందో అర్ధం చేస్కోగలనని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలగవద్దన్న నేపథ్యంలోనే ఇక్కడ ఆందోళన చేయడం వద్దనన్నాని తెలిపారు. చంద్రబాబు అరెస్టు విషయం ఏపీలోని రెండు పార్టీల మధ్య ఉన్న అంశమని, తమని అందులోకి లాగవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు. బాబు ప్రాణాలకు ముప్పు ఉందని లోకేష్‌ ట్వీట్‌.. రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్‌దే బాధ్యతన్నారు. చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారని ఆరోపించారు. తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారన్నారు. జైలులో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. దోమలు, కలుషిత నీటితో ఇబ్బంది పడుతూ, ఇన్‌ఫెక్షన్‌, అలర్జీతో బాధపడుతున్నారని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :