Saturday, 18 May 2024 12:36:37 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

దిశా కేసు ఎన్ కౌంటర్పై సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై విచారణ

Date : 12 April 2023 11:46 AM Views : 134

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : HYD : దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్‌ నివేదికపై హైకోర్టు ఇవాళ.. 2023, ఏప్రిల్ 12వ తేదీన విచారించనుంది. జనవరిలో హైకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక సమర్పించింది. అయితే కమిషన్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోవద్దని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో గతంలో బాధితుల తరఫున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా గ్రోవర్ వాదించారు. ఎన్ కౌంటర్ తీరును కోర్టు దృష్టికి తీసుకు వచ్చిన ఆయన... పోలీసులు తెలిపిన పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలీసు కస్టడీలోని ఉన్న నలుగురు నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసే పేరుతో ఎన్ కౌంటర్ చేశారని కోర్టుకు వివరించారు. సీసీ టీవీలో లారీని చూసి మొదట గుర్తు పట్టింది ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు తెలిపారని....కానీ కమిషన్ ముందు లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి ఆ విషయం చెప్పలేదన్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఓ కట్టుకథ అని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. పోలీసుల వాంగ్మూలంలో తప్పులున్నాయని చెప్పిన కమిషన్... వాస్తవంగా ఏం జరిగిందో చెప్పడంలో విఫలం అయిందని పోలీసుల తరఫు వాదించిన న్యాయవాది కోట కీర్తి కిరణ్ తెలిపారు. మూడేళ్ల కిందట హైదరాబాద్ సమీపంలో జరిగిన దిశ అఘాయిత్యం, హత్య అప్పట్లో కలకలం రేపింది. అనంతరం వారం రోజులకే ఈ కేసులో నిందితులు ఎన్ కౌంటర్ కావడం సంచలనంగా మారింది. అయితే ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని జస్టిస్ సిర్పూర్కార్ కమిషన్ తేల్చింది. ఎన్ కౌంటర్ కు సంబంధించి పోలీసులు చెబుతున్న విషయాలు నమ్మ దగ్గవిగా లేవని పేర్కొంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :