Saturday, 19 April 2025 03:22:35 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సైబరాబాద్ సీపీ పర్యటన

Date : 30 October 2023 08:51 AM Views : 230

జై భీమ్ టీవీ - తెలంగాణ / : త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నానక్ రామ్ గూడ, ఖానామెట్, మాదాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గం లోని మూసాపేట్ ప్రాంతాల్లోని సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలీసులు, ప్రజలకు తగు సూచనలు చేశారు. ముందుగా అత్తాపూర్‌లో సిక్ చావనీలో సిక్కు కమ్యూనిటీతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతంలో పాత నేరస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు సీపీ. ఎన్నికల సందర్భంగా రౌడీషీటర్లను తక్షణమే బైండోవర్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. పాత నేరస్తులు ఏదైనా రాజకీయ పార్టీలో తిరిగి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా రౌడీషీటర్లు అతి చేసినా, ఎన్నికల సందర్భంగా హింస తలపెట్టేందుకు ఎవరైనా యత్నించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. తెలంగాణ దంగల్‌లో మనీ, మందు పంపిణీపై ఈసీ నిఘా పెంచింది. ఈసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరమయ్యాయి. టచ్‌ చేస్తే క్యాష్‌ కోట్లలో పట్టుబడుతోంది. నగదుతో పాటు ఈసారి నగలు జిగల్మేన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వారంలోనే 100 కోట్లకు పైగా సొత్తు దొరకడం తీవ్ర కలకాలంరేపుతుంది. మరోవైపు మనీ, మద్యం పంపిణీపై పొలిటికల్‌ సవాళ్లు- ప్రతిసవాళ్ల మోత మోగుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :