Saturday, 18 May 2024 01:11:21 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మేము సైతం.. ఎన్నికల ప్రచారంలో మహిళల హవా.. ఎమ్మెల్యే అభ్యర్థి కోసం గల్లీ గల్లీలో జోరుగా..

Date : 18 November 2023 12:46 PM Views : 87

జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్,నవంబర్ 18; రాష్ట్రంలో ఎన్నికల హడావిడి నెలకొంది. పొలిటికల్ పార్టీలు పోటీ పడి ప్రచారాలతో దూసుకుపోతోన్నాయి. ఓటర్ దేవుళ్ల ను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. తమ సొంత నియోజక వర్గాల్లో అభ్యర్థులు ప్రచారాల స్పీడ్ పెంచారు. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కోసం తమ భార్యలు క్యాంపెయిన్స్ లో చురుక్కగా పాల్గొంటున్నారు. తమ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటూ.. మహిళా కార్యకర్తలు సైతం క్యాంపెయిన్స్ లో తిరుగుతున్నారు.తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలతో పొలిటికల్ హీట్ నెలకొంది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనతో వారి నియోజక వర్గాల్లో ప్రచారల స్పీడ్ పెంచారు. ప్రధాన పార్టీల నుండి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సొంత నియోజక వర్గాలో ప్రచారం జోరు పెంచారు. అయితే ఆయా పార్టీల అభ్యర్థులకు క్యాంపెయిన్స్ లో తోడుగా తమ సతీమణులు కూడా ప్రచారాల్లో నిలుస్తున్నారు. గెలుపు కోసం తమ వంతుగా ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొంటున్నారు. వీరితో పాటూ మహిళా కార్యకర్తలు సైతం ప్రచారాలతో సందడి చేస్తున్నారు. – రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటి చేసే రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల స్ట్రాటజీలతో క్యాంపెయిన్ చేస్తున్నాయి. ముఖ్యంగా గెలుపు ఓటములను నిర్ణయించే వారిలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. రాష్ట్రంలో ఓటర్లలో సగానికి పైగా మహిళ ఓటర్లు ఉన్నారు. తాజాగా ఎలెక్షన్ కమీషన్ లెక్కల ప్రకారం 1.52 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులోనూ రూరల్ లెవెల్లో మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వారిని ఆర్షించడంతో పాటూ…ఎమ్మెల్యే క్యాండేట్స్ క్యాంపెయిన్స్ కు బూస్ట్ ఇచ్చేందుకు తమ కుటుంబ సభ్యులు ప్రచారాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీఎస్ పీ, బీజేపి పార్టీల అభ్యర్థుల కుటుంబ సభ్యులు జిల్లాల్లో తిరుగుతూ ప్రచారాల్లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. Health Tips: ఈ చేదు కూరగాయ ఆకులు కూడా దివ్యౌషధమే..! డజన్ల కొద్దీ వ్యాధులను తరిమికొడతాయి.. ముఖ్యంగా ఈ చలికాలంలో.. – ప్రధాన పార్టీల లీడర్ల ప్రచారాలతో పాటూ నియోజవర్గాల్లో నెల కొన్న సమస్యలు తెలుకోవడం, ఓటర్ల నాడి పట్టుకోవడంలో మహిళల క్యాంపెయిన్ సెంటింమెంట్ గా ఉపయోగపడుతోంది. బై ఎలక్షన్స్ టైమ్ లోనూ లీడర్ల కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారాల్లో పాల్గొన్నారు. BRS పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం మహిళలను ఆకట్టుకునేందుకు మహిళలే టార్గెట్ గా మెనిఫెస్ట్ ల్లో 500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహా లక్ష్మి పేరుతో మహిళలకు 2500 ఆర్థిక సాయం వంటి గ్యారెంటీలను మహిళ ఓటర్లకు వివరిస్తున్నారు. అధికార పార్టీ కల్యణా లక్ష్మి, న్యూ ట్రీషన్ కిట్, గర్బీణీలకు కేఆర్ కిట్టు, ఒంటరి మహిళలకు అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేసుకుంటున్నారు. అయితే గ్రామాలు, మండల స్థాయిల్లో నిర్వహించే ప్రచారల్లో ఎక్కువగా మహళలు పాల్గొంటున్నారు. – ఎన్నికల ప్రచారల్లో మహిళ, వృద్దుల ఓటర్లను ఆకట్టుకునేలా మహిళ కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నారు. ఒకప్పుడు ప్రజాధరణ ఉన్న పార్టీ లీడర్లు, సెలెబ్రెటీ ప్రచార కర్తలు క్యాంపెయిన్స్ లో కీలకంగా పాల్గొనే వారు. ఇప్పుడు అభ్యర్థుల సతీమణులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున అభ్యర్థుల తరుపున ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఒకప్పటి రాజకీయలతో పోల్చితే ఏటేటా పాలిటిక్స్ లో మహిళ పార్టిసీపేసన్ పెరుగుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :