Saturday, 14 September 2024 04:24:10 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఉన్న పళంగా జాతీయ పతాకానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెల్యూట్.. ఎందుకు చేశారంటే..!

Date : 14 November 2023 12:44 PM Views : 110

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటేనే హడావుడిగా ఉంటూ క్షణం తీరిక ఉండదు. ప్రత్యేకంగా జాతీయ పతాకానికి సెల్యూట్ చేయడం.. జాతీయ గీతాలాపన చేయరు. ఏదైనా ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమాల్లోనే ప్రజా ప్రతినిధులు, నేతలు జాతీయ గీతాలాపన చేస్తుంటారు. అది కూడా చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి ఘటననే నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజీగా ఉన్న పార్లమెంటు సభ్యులు.. నడిరోడ్డు ఉన్న పళంగా ఆగి మరీ, జాతీయ జెండాకు వందనం చేశారు. జాతీయ పతాకానికి కోమటి రెడ్డి సెల్యూట్ ఎందుకు చేశారన్నదీ హాట్‌ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తుంది. నిత్యం బిజీగా ఉండే రాజకీయ నాయకులకు ఎన్నికల సమయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. అలాంటి సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ చౌరస్తాలో ఆగి జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు. అంతేకాదు జాతీయ గీతాలాపన చేశారు. నిత్యం తీరిక లేకుండా ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకానికి సెల్యూట్ ఎందుకు చేశారన్నదీ ఆసక్తికరంగా మాంది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నల్లగొండలో ఉంటూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. యువతలో దేశభక్తి పెంపొందించాలనే నిశ్చయంతో జనగణమన ఉత్సవ సమితి 2021 జనవరి 23న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి రోజున నల్లగొండ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో నిత్య జాతీయ గీతాలపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి నిర్విరామంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే నల్లగొండ పట్టణంలోని ప్రధాన రహదారిలో మైక్‌లను ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం 8.30 గంటలకు ప్రధాన కూడళ్లలో జాతీయ గీతాలపన ప్రారంభమవుతుంది. గీతాలాపన సమయంలో రోడ్లపై వెళ్తున్న పాదాచారులు, వాహన దారులు స్వీయ క్రమశిక్షణతో జాతీయ గీతం ఆలపిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ క్లాక్ టవర్ మీదుగా వెళుతున్నారు. అదే సమయంలో ఉదయం 8:30 గంటలకు క్లాక్ టవర్ సెంటర్ లో జాతీయగీతాలాపన చేస్తున్నారు. ఇది గమనించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వాహనం దిగి జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు. అంతేకాదు సామాన్యులతోపాటు కోమటిరెడ్డి కూడా జాతీయ గీతాలాపన చేశారు. సాధారణంగా జాతీయ గీతాలాపన సమయంలో ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు తమ వాహనాలు దిగి జాతీయ పతాకానికి సెల్యూట్ చేయడానికి కూడా వెనకాడుతుంటారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి వెళ్తూ జాతీయ పతానికి సెల్యూట్ చేసి దేశభక్తిని చాటుకున్నారని పట్టణవాసులు అభినందిస్తున్నారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి పదవిపై మరోసారి మనసులోని మాటను బయటపెట్టారు కోమటిరెడ్డి. సోనియాగాంధీ తలుచుకుంటే తాను తెలంగాణ సీఎం అవుతానన్నారు. నల్గొండ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు కేసీఆర్ సర్కార్ ‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే నెలలో కేసీఆర్‌‌‌‌ నియంత పాలన అంతమవుతుందని, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని జోస్యం చెప్పారు కోమటిరెడ్డి. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగు పడలేదన్నారు. ఉద్యమ ద్రోహులంతా కేసీఆర్ వంచన చేర్చుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలుపై కేబినెట్ తొలి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :