Saturday, 18 May 2024 11:37:49 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కేసీఆర్‌ మదిలో హుస్నాబాద్‌ సెంటిమెంట్‌.. మూడోసారి గెలుపు ధీమాతో ఎన్నికల బరిలోకి.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

Date : 16 October 2023 09:41 AM Views : 88

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. అధికారికంగా విడుదలైన ఈ షెడ్యూల్ ప్రకారం ఈ సారి కూడా హుస్నాబాద్ నుండే తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధినేతగా సభల్లో ప్రసంగించిన ఉద్యమనేత ఈ సారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉపన్యాసించనున్నారు. ఆ రెండూ కూడా…. ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో హుస్నాబాద్ సెంటిమెంట్ గా భావిస్తున్నారని అనుకుంటుంటాం. కానీ ఇందులో మరో కోణం కూడా దాగి ఉందన్న విషయం చాలా మంది గమనించకపోవచ్చు. ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న వొడితెల సతీష్ బాబు ఫ్యామిలీ కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. స్వరాష్ట్ర కల సాకారం కోసం డిప్యూటీ స్పీకర్ గా అండర్ గ్రౌండ్ లో ఉంటూ సమీకరణాలు చేసిన కేసీఆర్ కు మొదట అండగా నిలిచింది కూడా వొడితెల బ్రదర్సే. మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వర్ రావు, కెప్టెన్ లక్ష్మీ కాంతరావులు కేసీఆర్ చేపట్టే ప్రతి వ్యూహంలోనూ ఈ అన్నదమ్ములిద్దరు కూడా వెన్నుదన్నుగా నిలిచారు. వొడితెల రాజేశ్వర్ రావు మరణానంతరం కూడా కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం అంతా కూడా కేసీఆర్ తో కలిసి నడిచింది. హుస్నాబాద్ నుండి ప్రచారాన్ని ప్రారంభించినట్టయితే అన్ని విధాలుగా సక్సెస్ అవుతామని కూడా ఆయనకు వాస్తు శాస్త్ర పండితులు చెప్పడంతో మొదట అక్కడి నుండే తన ప్రచార పర్వాన్ని మొదలు పెట్టారు. అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ కేసీఆర్ ఈ ఎన్నికల్లోనూ హుస్నాబాద్ లోనే తొలి సభ ఏర్పాటు చేస్తున్నారు. అటు ఈశాన్య ప్రాంతంగా భావించే హుస్నాబాద్ తో పాటు మరో వైపున ఉద్యమం నుండి కూడా అన్నింటా అక్కున చేర్చుకున్న వొడితెల కుటుంబానికి చెందిన సతీష్ బాబు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో కలిసి వచ్చిందని కేసీఆర్ నమ్ముతున్నారని అంటున్నారు. ఇవి కూడా చదవండి Image Israel Palestine War: యుద్ధంతో రాసిన ప్రేమకథ.. పెళ్లి నుంచి నేరుగా దేశం కోసం.. Image Telangana: నీళ్ల కోసం ఊరి చివరి బావిలో దిగిన గిరిజనులు.. ఒక్కసారిగా కనిపించిన సీన్‌ చూసి పరుగో పరుగు.. Image Hyderabad: సమయం లేదు మిత్రమా..! ఎన్నికల వేళ ప్రచార వాహనాలకు ఫుల్ డిమాండ్.. పోటా పోటీ కొనుగోళ్లు.. Image అక్టోబర్ చలిలో ఈ ఆయుర్వేద ఆహారాలు తినండి.. సీజనల్‌ వ్యాధులు దరి చేరవు..! అక్కడి నుండే… అయితే, కేసీఆర్ రాష్ట్రం నలుమూలల చుట్టివచ్చేందుకు ఖరారయిన షెడ్యూల్ ను కూడా అమలు చేసేందుకు ఎర్రవెల్లి పాం హౌజ్ వేదికగానే కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫాం హౌజ్ నుండే కేసీఆర్ రోజు వారి ప్రచారాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. మూడోసారీ హుస్నాబాద్‌ సెంటిమెంట్‌తో ఎన్నికల యుద్ధం మొదలు పెట్టిన కేసీఆర్‌ రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. హుస్నాబాద్‌లో తొలి సభతో కేసీఆర్‌ ప్రచారం ఊపందుకోనుంది. ఇక కేసీఆర్‌ పూర్తి షెడ్యూల్‌ పరిశీలించినట్టయితే… – అక్టోబర్‌ 15న హుస్నాబాద్‌ – 16న జనగామ, భువనగిరి – 17న సిరిసిల్ల, సిద్దిపేట – 18న జడ్చర్ల, మేడ్చల్‌ – 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, మునుగోడు – 27న పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌ – 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు – 30న జుక్కల్‌, బాన్సువాడ, నారాయణఖేడ్‌ – 31న హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ – నవంబర్‌ 1న సత్తుపల్లి, ఇల్లందు – 2న నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి – 3న భైంసా, ఆర్మూర్‌, కోరుట్ల – 5న కొత్తగూడెం, ఖమ్మం – 6న గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట – 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి – 8న సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి – 9న కామారెడ్డితో తొలి దశ ప్రచారం ముగింపు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :