Saturday, 18 May 2024 10:08:46 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష..

రేవంత్ ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్

Date : 30 November 2022 10:18 AM Views : 231

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఎమ్మెల్సీ కవిత, రేవంత్ మధ్య ట్వీట్‌వార్‌. దీక్షా దివస్‌పై వ్యంగ్యంగా ట్వీట్ చేసిన కామెంట్‌కు అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు కవిత. పప్పన్నం తిని, బోనం ఎత్తినందుకే సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని రేవంత్ అంటే.. బోనం ఎత్తిన ఆడపడుచులను అవమానిస్తారా అంటూ ప్రశ్నించారు కవిత తెలంగాణ బిడ్డలు చేసిన ప్రతి బలిదానం కాంగ్రెస్ చేసిన హత్యేనని ఆరోపించారు MLC కల్వకుంట్ల కవిత. తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టేనని, దీక్షా దీవస్‌ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా కవిత ఫైరయ్యారు. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని ట్వీట్ చేశారు కవిత. ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదన్నారు కవిత. తెలంగాణ కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ , దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణ రాష్ట్రం తెచ్చారు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానన్న నమ్మకం లేకే రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్ వెళ్లారన్నారు. తానూ ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీకి పోటీ చేసి గెలిచానని కవిత స్పష్టం చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :