Saturday, 18 May 2024 10:08:41 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్న కారు.. సీఎం కేసీఆర్ నాన్‌స్టాప్‌ ప్రచారం.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే..

Date : 29 October 2023 09:26 AM Views : 69

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీలూ స్పీడ్ పెంచాయి. బహిరంగ సభలు, ప్రచారాలతో ప్రజలకు చేరువై.. ఓట్లను అభ్యర్థించే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే.. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే.. కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ కాస్త ముందు వరసలో ఉంది. అభ్యర్థులను కూడా ముందే ప్రకటించిన బీఆర్ఎస్‌.. ప్రచారంలోనూ టాప్‌ గేర్‌లో వెళ్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్.. తొలి విడతలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి గురించి ప్రస్తావించడంతోపాటు.. విపక్షాల విమర్శలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక.. దసరా తర్వాత రెండో విడత ప్రచారం షురూ చేశారు గులాబీబాస్‌ కేసీఆర్‌. దానిలో భాగంగా.. రెండు రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక రోజు గ్యాప్‌ తర్వాత.. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్‌. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 9వరకు నాన్‌స్టాప్‌ ప్రచారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దుమ్మురేపనున్నారు. ఒక్కో రోజు రెండు, మూడు ప్రచార సభలతో సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు. రెండో విడత ప్రచారంలో చివరిరోజు నవంబర్ 9న గజ్వేల్‌, కామారెడ్డి నుంచి కేసీఆర్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆ రెండు నియోజకవర్గాల్లోని ప్రజా ఆశీర్వాద సభలకు హాజరవుతారు. సీఎం కేసీఆర్ తోపాటు.. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వరుసగా సమావేశాలు, నియోజకవర్గ పర్యటనలు చేస్తూ ఎప్పటిప్పుడు క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్‌ పక్కా వ్యూహాలతో ముందుకువెళ్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :