Saturday, 18 May 2024 01:42:02 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

హోరాహోరీ పోరు.. తల పట్టుకుంటున్న అధిష్టానం.. తెలంగాణ కాంగ్రెస్‌లో మూడు సీట్ల పంచాయితీ..!

Date : 07 November 2023 11:30 AM Views : 66

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో అభ్యర్థుల టెన్షన్ నెలకొంది. ఫస్ట్‌ లిస్ట్‌లో 55మంది అభ్యర్ధుల్ని, సెకండ్‌ లిస్ట్‌లో 45మంది అభ్యర్ధుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రీసెంట్‌గా మూడో జాబితా కూడా అనౌన్స్‌ చేసింది. రెండు స్థానాల్లో అభ్యర్ధుల్ని మార్చుతూ 16మందితో థర్డ్‌ లిస్ట్‌ ప్రకటించింది. ఇంకా నాలుగు సీట్లను పెండింగ్‌లో పెట్టింది. అయితే, నాలుగింటిలో మూడింటిపై ఎడతెగని పంచాయితీ కొనసాగుతోంది. ఆ మూడు సీట్లూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనివే కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని.. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ.. ఈ మూడింటిపైనే తెలంగాణ కాంగ్రెస్‌లో పంచాయితీ కొనసాగుతోంది. చర్చల మీద చర్చలు జరుపుతున్నా పంచాయితీ మాత్రం తెగడం లేదు. మూడు జాబితాలు ప్రకటించినా ఈ మూడు సీట్లపై మాత్రం కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎటూ తేల్చుకోలేకపోతోంది. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ టికెట్ల కోసం హోరాహోరీ ఫైట్‌ నెలకొనడంతో.. అభ్యర్ధుల ఎంపికపై అధిష్టానం తల పట్టుకుంటోంది. ఒకవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, ఇంకోవైపు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తమ వాళ్ల కోసం హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ మూడు సీట్లపై కాంగ్రెస్‌ సీఈసీ మీటింగ్స్‌లో కూడా తీవ్ర వాగ్వాదాలు జరిగినట్లు సమాచారం.. తుంగతుర్తిలో ఆరుగురి మధ్య పోటీ.. తుంగతుర్తి, ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం.. ఇక్కడ ఏకంగా ఆరుగురు టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. అద్దంకి దయాకర్‌, డా.రవి, ప్రీతం, కృష్ణవేణి మధ్య హోరాహోరీ వార్‌ జరుగుతోంది. టికెట్‌ కోసం నువ్వానేనా అని పోటీపడుతున్నారు ఈ నలుగురు. ఈ రేస్‌లోకి రీసెంట్‌గా వచ్చిచేరారు మోత్కుపల్లి నర్సింహులు, మందుల సామేల్‌. దీంతో ఆరుగురిలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది పార్టీలో టెన్షన్ నెలకొంది. అద్దంకి దయాకర్‌, ఇక్కడ్నుంచి రెండుసార్లు పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్‌ పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్నారు. రేవంత్‌ వర్గంగా ముద్రపడ్డారు. డా.రవి, ప్రీతం కూడా తుంగతుర్తి రేస్‌లో ఉన్నా కృష్ణవేణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కృష్ణవేణికి టికెట్‌ ఇప్పించేందుకు కోమటిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొత్తగా పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక్కడ మాదిక సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉండటంతో మోత్కుపల్లి పేరును కూడా పరిశీలిస్తున్నట్టు టాక్‌. అలాగే, మందుల సామేల్‌ పేరు కూడా రేస్‌లో వినిపిస్తోంది. సూర్యాపేట నియోజకవర్గంలో.. సూర్యాపేటలో పటేల్‌ రమేష్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి మధ్య హోరాహోరీ ఫైట్‌ నడుస్తోంది. టికెట్‌ కోసం నువ్వానేనా అన్నట్టుగా తలపడుతున్నారు ఇద్దరు. పటేల్‌ రమేష్‌రెడ్డి అభ్యర్ధిత్వం కోసం రేవంత్‌రెడ్డి పట్టుబడుతున్నట్టు సమాచారం. మిర్యాలగూడలో.. మిర్యాలగూడలోనూ ఇదే పరిస్థితి. బత్తుల లక్ష్మారెడ్డి, శంకర్‌నాయక్‌ మధ్య టఫ్‌ ఫైట్‌ నడుస్తోంది. బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఉత్తమ్‌, కోమటిరెడ్డి కలిసి ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :